Site icon Prime9

Asia Cup : సెప్టెంబర్‌లో ఆసియా కప్.. ఒకే గ్రూప్‌లో భారత్, పాక్..

Asia Cup

Asia Cup

Asia Cup : ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్ లో ఒకే గ్రూప్‌లోభారత్, పాకిస్థాన్‌లు ఉంటాయని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జే షా గురువారం ప్రకటించారు. భారత్, పాకిస్థాన్‌లు ఒక గ్రూపులో డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంక, ఆ తర్వాత బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, మరో గ్రూప్‌లో ఉన్నాయి. 50 ఓవర్ల ఫార్మాట్లో టోర్నీ ఉంటుందని ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ధ్రువీకరించింది.

ఆసియా కప్‌లో ఆరు జట్లు రెండు గ్రూపులు‌గా తలపడనున్నాయి. భారత్, పాక్‌తోపాటు క్వాలిఫయర్ 1 ఒక గ్రూపులో ఉండగా.. డిపెండింగ్ ఛాంపియన్ శ్రీలంక, బంగ్లాదేశ్, అప్ఘానిస్థాన్ మరో గ్రూపులో ఉన్నాయి. ఆసియా కప్ 2023లో 13 మ్యాచ్‌లను నిర్వహిస్తారు.క్వాలిఫయర్స్ మినహా మొత్తం 13 మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటిలో ఆరు లీగ్ మ్యాచ్‌లు ఆరు సూపర్ 4 గేమ్‌లు ఉన్నాయి, రెండు అగ్రశ్రేణి జట్లు ఫైనల్‌లో తలపడతాయి. ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్‌లో ఆడటానికి బీసీసీఐ సముఖంగా లేదు. దీంతో ఆసియా కప్‌ను తటస్థ వేదికకు మార్చే అవకాశం ఉంది.

“2023 & 2024 కోసం @ACCMedia1 పాత్‌వే స్ట్రక్చర్ & క్రికెట్ క్యాలెండర్‌లను ప్రదర్శిస్తున్నాము! ఇది ఈ గేమ్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి మా అసమానమైన ప్రయత్నాలను & అభిరుచిని సూచిస్తుంది. దేశాల్లోని క్రికెటర్లు అద్భుతమైన ప్రదర్శనలకు సిద్ధమవుతున్నందున, ఇది క్రికెట్‌కు మంచి సమయం అని వాగ్దానం చేస్తుంది. ‘ అని షా ట్వీట్ చేశారు.

Exit mobile version