Niharika Konidela: నల్ల కలువలా విరిసిన నిహారిక.. భలే అందంగా ఉందే Prime9 News 4 weeks ago మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన మొదటి హీరోయిన్ నిహారిక.. కానీ హిట్ అందుకోకపోవడంతో పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి కూడా ఎంతో కాలం నిలబడలేదు. దీంతో నిహారిక విడాకుల తరువాత మళ్లీ హీరోయిన్ గా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఒక పక్క హీరోయిన్ గా చేస్తూనే ఇంకోపక్క నిర్మాతగా మారి.. సినిమాలను నిర్మిస్తుంది నిహారిక. తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా నిహారిక హీరోయిన్ గా సినిమాలు చేస్తూ వస్తుంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది తాజాగా కొన్ని కొత్త ఫోటోలను అభిమానులతో షేర్ చేసింది. బ్లాక్ కలర్ చీరలో మెగా డాటర్ ఎంతో అందంగా కనిపించింది. విరిసిన నల్ల కలువలా కనిపించింది. ప్రస్తుతం నిహారిక చీర ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.