Neha Shetty: వైట్ లెహంగాలో రాధికా.. దేవతలానే మెరిసిపోతుందే Roja Pantham 1 month ago neha shetty అందాల భామ నేహశెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాశ పూరి హీరోగా నటించిన మెహబూబా సినిమాతో నేహాశెట్టి తెలుగుతెరకు పరిచయమైంది. ఇక డీజే టిల్లు సినిమాతో అమ్మడు స్టార్ గా మారింది. ఈ సినిమా నేహాకు మంచి విజయాన్ని అందించింది. డీజే టిల్లు తరువాత నేహా పేరును రాధికగా మార్చేశారు అభిమానులు. ఈ సినిమా తరువాత అమ్మడు అలాంటి హిట్ కోసం ఎదురుచూస్తుంది. ప్రస్తుతం ఒక రెండు సినిమాలతో బిజీగా నేహా.. సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తాజాగా నేహశెట్టి వైట్ లెహంగాలో మెరిసింది. వైట్ లెహంగాలో క్లివేజ్ షో చేస్తూ సోషల్ మీడియాను హీట్టెక్కించింది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు దేవతలా ఉన్నావని కామెంట్ చేస్తున్నారు.