Namrata Shirodkar: రెడ్ కలర్ డ్రెస్ లో నమ్రత.. ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా
Roja Pantham
టాలీవుడ్ సూపర్ స్టార్ భార్య నమ్రత శిరోద్కర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
వంశీ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నమ్రత.. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే మహేష్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది.
పెళ్లి తరువాత మహేష్.. నమ్రతను సినిమాల్లో నటించవద్దని చెప్పడంతోనే ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చిందని టాక్.
ఇక పెళ్లి అయిన దగ్గరనుంచి ఘట్టమనేని కోడలిగా.. మహేష్ కు సపోర్ట్ సిస్టమ్ లా నమ్రత మారిపోయింది.
ఇద్దరు బిడ్డల తల్లిగా వారి ఆలనా పాలన చూసుకుంటూ కొన్నేళ్లు గడిపిన నమ్రత.. ఈ మధ్యకాలంలో తన అందంపై దృష్టి సారించింది.
నిత్యం మహేష్, పిల్లల ఫోటోలను షేర్ చేసే నమ్రత.. గత కొన్ని నెలల నుంచి తన ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
మొన్నటికి మొన్న ఒక పెళ్లి వేడుకలో పట్టుచీరలో కనిపించి కనువిందు చేసిన నమ్రత.. తాజాగా రెడ్ కలర్ డిజైనర్ డ్రెస్ లో పెళ్లి కూతురిలా మెరిసింది.
రెడ్ కలర్ డిజైనర్ లెహంగా పై డైమండ్ జ్యువెలరీ ఆమె అందాన్ని మరింత పెంచేసాయి.
ప్రస్తుతం నమ్రత రెడ్ డ్రెస్ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. ఒకప్పుడు అసలు సోషల్ మీడియాలోనే కనిపించని ఘట్టమనేని కోడలు.. ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలోనే కనిపిస్తుంది.
ఇక ఈ ఫోటోలను చూసిన అభిమానులు.. నమ్రత ఇద్దరు బిడ్డల తల్లి అయ్యి ఉండి కూడా ఫిట్ నెస్ ను మెయింటైన్ చేస్తూ అందాన్ని కాపాడుకుంటుంది. సూపర్ అని కామెంట్స్ చేస్తున్నారు.