Nabha Natesh: పిజ్జా పార్టీ.. క్యాజువల్ డ్రెస్ లో కూడా కాక పుట్టిస్తున్న ఇస్మార్ట్ పోరీ
Roja Pantham
టాలీవుడ్ లో ఒక మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న కుర్ర హీరోయిన్స్ లో నభా నటేష్ ఒకరు.
నన్ను దోచుకుందవటే అనే సినిమాతో నభా తెలుగుతెరకు పరిచయమైంది.
మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న నభాకు ఆఫర్లు బాగానే వచ్చాయి కానీ హిట్స్ మాత్రం దక్కలేదు.
ఇక పూరి జగన్నాథ్ – రామ్ పోతినేని కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నభా నటేష్ భారీ విజయాన్ని అందుకుంది.
ఇస్మార్ట్ శంకర్ సినిమాలో అమ్మడు తెలంగాణ పోరీగా నటించి మెప్పించింది.
ఇక ఇస్మార్ట్ శంకర్ తరువాత స్టార్ హీరోయిన్ లిస్ట్ నభా కుడా యాడ్ అవుతుంది అనుకుంటే చిన్నదానికి అంత లక్ కలిసిరాలేదు.
మధ్యలో నభాకు పెద్ద ప్రమాదం జరగడం, ఒక ఏడాది రెస్ట్ తీసుకోవడంతో ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చింది.
ఇక ఆ గ్యాప్ తరువాత నభా సోషల్ మీడియా మీద పడింది. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది.
తాజాగా నభా ఇంట్లోనే పిజ్జా పార్టీ చేసుకుంది. వైట్ టాప్.. షార్ట్ లో క్యాజువల్ గా కనిపిస్తూనే అందాలను ఆరబోసింది.
ఒకపక్క నడుము అందాలు.. ఇంకోపక్క థైస్ షో చేస్తూ.. నభా హొయలు పోతూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.