Krithi Shetty: కిల్లింగ్ లుక్స్ తో చంపేస్తున్న బేబమ్మ.. Roja Pantham 1 month ago krithi shetty టాలీవుడ్ బ్యూటీ కృతిశెట్టి ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే కృతి మంచి విజయాన్ని అందుకుని టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఉప్పెన తరువాత కృతి వరుసపెట్టి సినిమాలు చేస్తూనే వచ్చింది కానీ, మొదటి సినిమా ఇచ్చిన విజయాన్ని మాత్రం మరోసారి అందుకోలేకపోయింది. ఉన్నకొద్దీ కృతి కూడా అందాల ఆరబోతకు సై అంటుంది. అవకాశాల కోసం అమ్మడు కూడా సోషల్ మీడియానే నమ్ముకుంది. వరుస ప్లాప్స్ ను అందుకున్నా కూడా సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తుంది. తాజాగా కృతిశెట్టి అల్ట్రా స్టైలిష్ లుక్ లో అదరగొట్టేసింది. కాఫీ కలర్ డిజైనర్ డ్రెస్ లో మెప్పించింది. కిల్లింగ్ లుక్స్ తో కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.