Site icon Prime9

Modi -Sheik Hasina Meeting: భారత్‌ – బంగ్లా మధ్య స్నేహం మరింత బలోపేతం!

Modi -sheik Hasina Meeting

Modi -sheik Hasina Meeting

Modi -Sheik Hasina Meeting: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనా మధ్య శనివారం నాడు ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్య రక్షణ రంగంతో పాటు రక్షణ ఉత్పత్తులు, కౌంటర్‌ టెర్రరిజానికి సంబంధించిన అంశాల్లో ఒకరి కొకరు సహాయం చేసుకోవడంతో పాటు సరిహద్దు అంశాల గురించి న్యూఢిల్లీలో వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. తర్వాత జరిగిన జాయింట్‌ ప్రెస్‌మీట్‌లో ప్రధాని మోడీ సమావేశం వివరాలు వెల్లడించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేయడంపై ఫోకస్‌ పెట్టామన్నారు మోదీ.

బంగ్లాదేశీయులకు ఇ-మెడికల్ వీసా..(Modi -Sheik Hasina Meeting)

ఇరు దేశాలు కలిసి సంయుక్తంగా ప్రజల సంక్షేమం కోసం పలు కీలక ప్రాజెక్టులు పూర్తి చేశామని మోదీ చెప్పారు. దీంతో పాటు ఇరు దేశాల మధ్య వాణిజ్యం గురించి ప్రస్తావిస్తూ.. ఇక నుంచి వాణిజ్యం అంతా ఇండియన్‌ కరెన్సీ రూపాయిల్లో జరుగుతుందన్నారు. వైద్య చికిత్స కోసం భారతదేశానికి వచ్చే బంగ్లాదేశీయుల కోసం భారతదేశం ఇ-మెడికల్ వీసా సౌకర్యాన్ని, అలాగే రంగ్‌పూర్‌లో కొత్త అసిస్టెంట్ హైకమిషన్‌ను ప్రారంభించనుంది.ప్రపంచంలోనే అత్యంత పొడవైన గంగానదిలో ఇండియా, బంగ్లాదేశ్‌లు కలిసి రివర్‌ క్రూయిస్‌ను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. అలాగే ఇరు దేశాల మధ్య స్నేహానికి నాందిగా క్రాస్‌ బార్డర్‌ ఫ్రెండ్‌షిప్‌ పైప్‌లైనును పూర్తి చేశామన్నారు. అలాగే విద్యుత్‌ ఎగుమతి నేపాల్‌ నుంచి బంగ్లాదేశ్‌కు వయా ఇండియన్‌ గ్రిడ్‌ ద్వారా పంపడం జరుగుతోందన్నారు. కేవలం ఒకే ఒక సంవత్సరంలో ఇన్ని ప్రాజెక్టులు పూర్తి చేశామని, దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడుతాయని ప్రధాని అన్నారు.

ఇక ఇరు దేశాలు ఫోకస్‌ పెట్టాల్సింది కనెక్టివిటి, కామర్స్‌ అండ్‌ కొలాబిరేషన్స్‌అని చెప్పారు ప్రధాని. అలాగే డిజిట్‌, ఎనర్జీ కనెక్టివిటి పై కూడా ఫోకస్‌ పెట్టనున్నట్లు తెలిపారు. అలానే ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపర్చడానికి సీఈపీఏపై చర్చలు జరగాల్సి ఉంది. ఇండియా, బంగ్లాదేశ్‌ మధ్య 54 నదులను అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌, మంచినీటి ప్రాజెక్టు.. వరదలపై ముదుస్తు హెచ్చరికలపై ఇరుదేశాలు ఒకరితో ఒకరు సహకరించుకోవాల్సిన అవసరం ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు. గత ఏడాది కాలంలో బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనాతో తాను పది సార్లు భేటీ అయ్యాను. అయితే తాను మూడవ సారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమెతో కలవడం ఇదే మొదటిసారి అన్నారు ప్రధాని . ఇండియాతో బలమైన సంబంధాలను బంగ్లాదేశ్‌ కోరుతుందని షేక్‌ హసీనా అన్నారు. ప్రధాని మోదీని తమ దేశంలో పర్యటించవలసిందిగా షేక్‌ హసీనా ఆహ్వానించారు.

Exit mobile version