Site icon Prime9

Passenger Breaks Train Window: రైలుపై కుంభమేళా భక్తుల రాళ్ల దాడి – బీహార్‌ రైల్వే స్టేషన్‌లో ఉద్రిక్తత

Maha Kumbh Mela Devotees Breaks Train Window: బీహార్‌ రాస్ట్రంలో రైల్వే స్టేషన్‌ షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. భారీ రద్దీ కారణంగా ఆగ్రహానికి గురైన ప్రయాణికులు రైలుపై దాడి చేసిన ఘటన యూపీలోని మధుబని రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. ప్రయాణికులు రైలు కిటికి అద్దాలు పగలగొట్టిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌ రాజ్‌లో మహా కుంభమేళ జరుగుతున్న సంగతి తెలిసిందే.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ప్రయాగ్‌ రాజ్‌కు వస్తుండటంతో అక్కడ భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈ క్రమంలో ఆయా మార్గాల్లోని రైళ్లు భక్తుల రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్‌ రాష్ట్రంలోని మధుబని రైల్వే స్టేషన్‌లో కుంభమేళ భక్తులు రైలుపై దాడి చేశారు. స్వతంత్ర సేనానీ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు బీహార్‌లోని జైనగర్‌ నుంచి ప్రయాగ్‌రాజ్‌ మీదుగా న్యూ ఢిల్లీకి వెళ్తోంది. ఈ క్రమంలో మధుబని రైల్వే స్టేషన్‌ వద్ద కుంభమేళా భక్తులు రైలు ఎక్కేందుకు ప్రయత్నించారు. అప్పటికే రైలు భక్తులతో పూర్తిగా నిండిపోయింది.

కాలుతీసి కాలుపెట్టేందుకు కూడా ఖాళీ లేనంతగా యాత్రికులతో రైలు నిండిపోయింది. దీంతో రైలు మధబని స్టేషన్‌ దగ్గర ఆగిన అధికారులు డోర్లు తెరవలేదు. దీంతో ఆగ్రహానికి గురైన కొందరు కుంభమేళా భక్తులు రైలుపై రాళ్లతో దాడి చేశారు. మరికొందరు కిటికి అద్దాలు పగలగొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రియాణికుల చర్యతో రైల్వే స్టేషన్ భయాందోళన వాతావరణం నెలకొంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. వీటిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar