Sonu Sood: బాలీవుడ్ నటుడు సోనూ సూద్, తన దాతృత్వంతో పలువురికి ఆదర్శంగా నిలిచాడు. అయితే ఇటీవల డోర్ దగ్గర ఫుట్‌బోర్డ్‌పై కూర్చొని రైలులో ప్రయాణించిన సోనూ సూద్ ను నార్తర్న్ రైల్వే మందలించింది. డిసెంబరు 13న కదులుతున్న రైలు డోర్ దగ్గర చతికిలబడి, హ్యాండిల్‌ని పట్టుకుని బయటికి చూసే వీడియోను సోనూ సూద్ స్వయంగా పంచుకున్నారు. ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో 639k వ్యూస్ తో వైరల్‌గా మారింది.వీడియోను ట్వీట్ చేస్తూ నార్తర్న రైల్వే సోనూ సూద్ చాలా మందికి రోల్ మోడల్‌గా ఉన్నందున భవిష్యత్తులో ఈ స్టంట్‌ను మళ్లీ ప్రయత్నించవద్దని కోరింది.
డియర్ @సోనూసూద్, దేశంలో మరియు ప్రపంచంలోని మిలియన్ల మందికి మీరు రోల్ మోడల్. రైలు మెట్ల మీద ప్రయాణించడం ప్రమాదకరం, ఈ రకమైన వీడియో మీ అభిమానులకు తప్పుడు సందేశాన్ని పంపవచ్చు. దయచేసి ఇలా చేయవద్దు. ! సాఫీగా మరియు సురక్షితమైన ప్రయాణాన్ని ఆస్వాదించండి అంటూ రైల్వే శాఖ హిందీలో ట్వీట్ చేసింది. ముంబై రైల్వే పోలీస్ కమిషనరేట్ కూడా సోనూ సూద్‌ను మందలించింది. ఇది ప్రమాదకరమని మరియు నిజ జీవితంలో సినిమాల్లో కనిపించే ఇటువంటి విన్యాసాలు చేయవద్దని కోరింది.
@సోనూసూద్ ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణించడం సినిమాల్లో ‘ఎంటర్‌టైన్‌మెంట్’కి మూలం కావచ్చు, నిజ జీవితంలో కాదు! అన్ని భద్రతా మార్గదర్శకాలను అనుసరించి, అందరికీ ‘హ్యాపీ న్యూ ఇయర్’ని అందజేద్దాం” అని జీఆర్పీ ముంబై ఒక ట్వీట్‌లో పేర్కొంది.
— sonu sood (@SonuSood) December 13, 2022