Site icon Prime9

Ramdev Baba : ‘షర్బత్ జిహాద్’పై హైకోర్టు ఆగ్రహం.. వెనక్కి తగ్గిన రాందేవ్ బాబా

Delhi HC slams Baba Ramdevs indefensible Rooh Afza remarks

 

 

Ramdev Baba : ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రూఫ్ అఫ్జా పానియంపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగనించింది. దీంతో రాందేవ్ బాబా  విడుదల చేసిన వీడియోలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నెల ప్రారంభంలో రాం దేవ్ బాబా పతంజలి సంస్థనుంచి విడుదలైన షర్బత్ ను ప్రమోట్ చేస్తూ వీడియో చేశారు. అందులో రూఫ్ అఫ్జా షర్బత్ తాగితే ఆ డబ్బును మర్సాలకు, మసీదులకు వెలతాయని అన్నారు. తన సంస్థ నుంచి తయారైన షర్బత్ ను కొంటే ఆ ధనం గురుకులాల అభివృద్దికి ఉపయోగపడతాయన్నారు. అంతే కాకుండా రూఫ్ అఫ్జా పానియాన్ని జిహాద్ షర్బత్ గా అభివర్ణించారు.

 

 

ఆగ్రహించిన ఢిల్లీ హైకోర్టు
రాందేవ్ బాబా వ్యాఖ్యలపై రూఫ్ అఫ్జా సంస్థ ప్రతినిధులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కేసును పరిశీలించిన  కోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. రాందేవ్ బాబా చేసిన వీడియోను నమ్మలేకపోయానని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.  మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వీడియో ఉందని హమ్ దర్ద్ తరపున వాదించిన న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు తెలిపారు. ఆయనతో ఏకీభవించిన న్యాయస్థానం వీడియోలను వెంటనే తొలగించాలని ఆదేశించారు.  మరో గంటలో తమ నియంత్రణలో ఉన్న అన్ని వీడియోలను తొలగించనున్నట్లు పతంజలి తరపు న్యాయవాది హామీ ఇచ్చారు.

 

 

భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రకటనలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టుచేయమని పేర్కొంటూ అఫిడవిట్ లో దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఐదురోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని తదుపరి విచారణ మే1కి వాయిదా వేసింది.

 

 

రాందేవ్ బాబా ప్రకటన ఎలా ఉందంటే
“(రూహ్ అఫ్జా షర్బత్ ను చూపిస్తూ)  ఫిర్ పురానే షర్బత్ పర్ అప్నే ధర్మ్ ఔర్ ధన్ కి బర్బాది క్యు ( మీ పాత షర్బత్ కొనడం వలన దర్మం, ధనం ఎందుకు వృధా చేసుకుంటున్నారు). మీరు ఆ షర్బత్ తాగితే, మదర్సాలు, మసీదులు నిర్మించబడుతాయి. అందుకు బదులుగా పతంజలీ గులాబీ షర్బత్ ను తాగండి. ఈ ధనంతో గురుకులాలు నిర్మించబడతాయి. ఆచార్య కులం అభివృద్ధి చెందుతఉంది. పతంజలి విశ్వవిద్యాలయం విస్తరిస్తుంది. భారతీయ శిక్షా బోర్డు అభివృద్ధి చెందుతుంది” అని వీడియో చేశారు రాందేవ్ బాబా.

 

 

షర్బత్ లవ్ జిహాద్
రూహ్ అఫ్జా షర్బత్ ను లవ్ జిహాద్ షర్బత్ గా అభివర్ణించారు బాబా రాందేవ్. ఇతర కూల్ డ్రిక్స్ లను టాయ్ లెట్ క్లీనర్లతో పోల్చారు. ప్రజలు తమ కుటుంబాన్ని, పిల్లలను టాయిలెట్ క్లీనర్ కూల్ డ్రింక్స్ నుంచి రక్షించుకోవాలంటే పతంజలి షర్బత్ ను మాత్రమే ఎన్నుకోవాలని ఆయన ప్రకటనలో తెలిపారు.

రాందేవ్ బాబా నడిపిస్తున్న పతంజలి సంస్థ వివాదంలోకి రావడం ఇదే మొదటిసారి కాదు. గత రెండు సంవత్సరాలుగా, పతంజలి మరియు దాని వ్యవస్థాపకులు వారి ప్రకటనల కారణంగా అనేక చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొన్నారు.

 

 

Exit mobile version
Skip to toolbar