Whip on Central govt Emplyoees: విధులకు ఆలస్యంగా వచ్చే ఉద్యోగులపై కేంద్రప్రభుత్వం కొరడా ఝళిపించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సెనల్ అండ్ ట్రెయినింగ్ (డీఓపీటి) దీనికి సంబంధించి విధి విధానాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పనిచేసే కేంద్రప్రభుత్వ ఉద్యోగులు ఉదయం ఠంచనుగా 9.00 గంటలకు విధులకు హాజరు కావాల్సిందే. 15 నిమిషాల పాటు ఆలస్యానికి అనుమతిస్తారు. దాటిందంటే సగం రోజు సిఎల్ లీవు కింద పరిగణిస్తామని డీఓపీటి ఒక నోట్‌లో తెలిపింది.
ఇది అందరూ ఉద్యోగులకు సీనియర్ అధికారులకు వర్తిస్తుంది. బయో మెట్రిక్ అటెండెన్స్‌ను అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. కోవిడ్ తర్వాత గత నాలుగు సంవత్సరాల నుంచి ఉద్యోగులకు బయోమెట్రిక్ అటెండెన్స్‌ను వాడటం లేదు. ఒక వేళ ఉద్యోగి ఆఫీసుకు రాలేకపోతే అడ్వాన్స్‌గా పై అధికారికి సమాచారం అందజేయాలి. ప్రతి ఉద్యోగి ఖచ్చితంగా ఉదయం 9.00 గంటలకు ఆఫీసుకు వచ్చి సాయంత్రం 5.30 గంటలకు వెళ్లి పోవాల్సి ఉంటుంది. అయితే చాలా ఆఫీసుల్లో జూనియర్ స్థాయి ఉద్యోగులు విధులకు ఆలస్యంగా రావడం.. అలాగే ముందుగానే వెళ్లపోవడం జరుగుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నోట్‌లో వివరించింది.
ఇక సీనియర్ అధికారులు మాత్రం తమకు ఫిక్స్‌డ్‌గా ఇన్ని గంటలు అనేది లేనేలేదు. సాధారణంగా సాయంత్రం 7.00 గంటలకు ఇంటికి వెళుతుంటామని చెబుతున్నారు. ఇంటికి వెళ్లాక కూడా ఆఫీసు పనిచేయాల్సి వస్తోందని.. వారాంతాల్లో.. సెలవు దినాల్లో,ఆదివారాలు కూడా ఆఫీసు పనిచేయాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 2014 నుంచి పనివేళలు కఠినంగా అమలు చేయడం ప్రారంభించారు. దీన్ని ఉద్యోగులు తీవ్రంగా ప్రతిఘటస్తున్నారు . దూరం నుంచి వస్తున్న ఉద్యోగుల సమయ పాలన పాటించాలంటే ఇబ్బంది అని ఉద్యోగులు వాదిస్తున్నారు.
ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అటెండెన్స్‌సిస్టమ్ ద్వారా ఉద్యోగులు సరైన సమయంలో ఆఫీసుకు వస్తున్నారా లేదా అధికారులు మానిటిరంగ్ చేస్తుంటారు.పలువురు సీనియర్ అధికారులు తమ ఆఫీసుల్లో బయోమెట్రిక్ పరికరాలను అమర్చి అటెండెన్స్ తీసుకుంటున్నారు. ఫిబ్రవరి 2022 నుంచి బయోమెట్రిక్ అటెండెన్స్‌ను అమల్లోకి వచ్చినా ఉద్యోగులు పెద్దగా పట్టించుకోకుండా విధులకు ఆలస్యంగా వస్తున్నారు.ఇక నుంచి అలాంటి కుదరవు. ఆలస్యంగా విధులకు వచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇప్పటికి చాలా మంది ఉద్యోగులకు ఉదయం 10 తర్వాత కార్యాలయాలకు రావడం….కొంచెం సేపు ఉండి వెళ్లిపోతుంటారు. ఇక అలాంటి కుదరవని డీఓపీటి హెచ్చరించింది.