Arvind Kejriwal said BJP manipulating voters list charge: బీజేపీపై ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ లోటస్‌లో భాగంగా ఢిల్లీలో బీజేపీ ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతోందని కేజ్రీవాల్ ఆరోపించారు. రానున్న ఢిల్లీ అసెంబ్లీలో ఓడిపోతామని తెలిసి.. గెలిచేందుకు అడ్డదారులు తొక్కేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఇందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదనే విషయం అర్దమైందన్నారు. ఇప్పటివరకు బీజేపీకి సీఎం అభ్యర్థి లేరని, నమ్మకమైన వ్యక్తులే కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ కొత్త కొత్త ఎత్తుగడలు వేసేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. ఇందులో భాగంగానే డిసెంబర్ 15 నుంచి‘ఆపరేషన్ లోటస్’పేరుతో ప్రభావితం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఓటరు జాబితాను ట్యాంపరింగ్ చేస్తుందని ఆరోపణ చేశారు.
కాగా, న్యూఢిల్లీ సెంబ్లీ నియోజకవర్గంలో గత కొంతకాలంగా బీజేపీ ఆపరేషన్ కొనసాగిస్తుందన్నారు. గత 15 రోజులుగా చేస్తున్న ఈ ఆపరేషన్‌లో దాదాపు 5వేల మందికిపైగా ఓటర్లను తొలగించేందుకు దరఖాస్తులు వచ్చాయన్నారు. దీంతో పాటు మరో 7,500 మందికిపైగా ఓటర్లను జాబితాలో చేర్చిందని ఆరోపించారు. దాదాపు 12శాతం ఓటర్లను తారుమారు చేస్తే ఇక ఎన్నికలు నిర్వహించాల్సి నఅవసరం ఏముందని నిలదీశారు. ఎన్నికల పేరుతో బీజేపీ గేమ్ ఆడుతోందని విమర్శలు చేశారు.
ఇదిలా ఉండగా, ఎన్నికలకు మరో కొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. ఢిల్లీలో మొత్తం 70 స్థానాలు ఉండగా.. ఆప్ 70 స్థానాలకు గానూ అభ్యర్థుల జాబితాను ఆప్ విడుద చేసింది. అలాగే ఈ ఎన్నికల్లో ఆప్ పొత్తు లేకుండానే ఒంటరిగా పోటీ చేసుందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన వివరాలను ఇప్పటికే ప్రకటించాడు. మరోవైపు, కేజ్రీవాత్ న్యూఢిల్లీ నియెజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా.. సీఎం ఆతిశీ మరోసారి కాల్కాజీ నుంచి బరిలో దిగుతున్నారు.