Site icon Prime9

Train Accident: రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్

8 coaches of Agartala-Lokmanya Tilak Express derail in Assam: దేశంలో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. అస్సాంలోని దిమా హసావో జిల్లాలో లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. అగర్తలా నుంచి ముంబై బయలుదేరిన ఈ రైలు ఇంజిన్ తో పాటు ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి. అస్సాంలోని దిబలోంగ్ స్టేషన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం 3.55 గంటలకు ఈ రైలు ప్రమాదం జరిగిందని చెప్పారు. పవర్ కార్, ఇంజిన్ తో పాటు ఎనిమిది కోచ్‌లు పట్టాలు తప్పాయన్నారు. ఈ ఘటన గురించి సమాచారం తెలియగానే సహాయక బృందాలు ఘటనస్థలానికి చేరుకున్నాయి. అయితే లుమ్ డింగ్ బాదర్ పూర్ సింగిల్ లైన్ హిల్ సెక్షన్ లో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

Exit mobile version