Site icon Prime9

Anantagiri: తెలంగాణ ఊటీ అనంతగిరిలో పర్యాటకుల సందడి

ANANATAGIRI

ANANATAGIRI

Anantagiri:  తెలంగాణ ఊటీగా పిలువబడే అనంతగిరి ఇప్పుడు నిజమైన ఊటిగా మారింది. రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఎక్కడ చూసినా జలపాతాలు జాలువారుతున్నాయి. ఈ సుందర దృశ్యాలను చూసి పర్యాటకులే కాదు స్ధానికులు కూడా మైమరిచిపోతూ ఎంజాయ్ చేస్తున్నారు.

ANANTAGIRI 2

ANANTAGIRI 3

ప్రకృతి అందాలను అస్వాదిస్తున్న పర్యాటకులు..(Anantagiri)

వికారాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో గల అనంతగిరి కొండల్లో గత మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అనంతగిరి అడివి మెత్తం తడిసి ముద్దైంది. దీంతో పర్యాటకులు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. అనంతగిరి కొండలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అనంతగిరి యాత్రలో ఆనందం మరియు ఆధ్యాత్మిక కలయిక ఉంటుంది. ఈ కొండలు 3,763 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి.

ఈ అందమైన ప్రకృతిలో ఇక్కడ అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది.ఇక్కడ ఏడాదికి రెండుసార్లు ఆషాడమాసం, మరియు కార్తీక మాసంలో జాతర జరుగుతుంది. తెలంగాణ, కర్ణాటక మరియు మహారాష్ట్ర ప్రజలు ఈ జాతరకు వస్తారు. పర్యాటకులు హరిత రిసార్ట్స్‌, దక్కన్ రిసార్ట్స్‌లో బస చేయవచ్చు.అనంతగిరికి రోడ్డు మరియు రైలు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. రైలు మార్గం లో సికింద్రాబాద్ నుండి వికారాబాద్ కు వచ్చి మరియు అక్కడ నుంచి ప్రభుత్వ లేదా ప్రైవేట్ రవాణా ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.

Exit mobile version
Skip to toolbar