Prime9

Niloufer Hospital Superintendent: నీలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ పై వేటు

Niloufer Hospital Superintendent Ravikumar Suspend: నీలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ రవి కుమార్‌పై వేటు పడింది. సూపరింటెండెంట్‌పై తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రవికుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇంచార్జ్‌గా డాక్టర్ విజయ్ కుమార్‌ను నియమించింది. నిలోఫర్ ఆసుపత్రి ఆవరణలో ప్రైవేట్ మందుల దుకాణం కూల్చివేశారు. ఈ దుకాణాన్ని ప్రభుత్వ స్థలంలో నిర్మించడంపై సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

సీఎంవో, మంత్రి పేర్లను సూపరింటెండెంట్ ఉపయోగించడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. తానెలాంటి అనుమతి ఇవ్వలేదని కలెక్టర్ స్పష్టం చేశారు. నిలోఫర్ ఆస్పత్రిలో రాత్రికి రాత్రే నిర్మించిన మందుల దుకాణాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాలతో అధికారులు తొలగించారు. ప్రైవేట్ మందుల దుకాణం ఏర్పాటుకు సంబంధించిన అంశంపై విచారణ జరిపి వివరణ ఇవ్వాలని వైద్యవిద్య సంచాలకుడు డాక్టర్ నరేంద్రకుమార్‌ను కలెక్టర్ ఆదేశించారు.

Exit mobile version
Skip to toolbar