Site icon Prime9

Marri Shashidhar Reddy: టీ కాంగ్రెస్ లో మరో వికెట్ డౌన్.. బీజేపీ గూటికి మర్రి శశిధర్ రెడ్డి

Marri

Marri

New Delhi: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీ గూటికి చేరారు. అాంటే బీజేపీ కండువా కప్పుకుని ఫోటో ఇవ్వడం తప్ప మిగిలిన ఫార్మాలిటీలు అన్ని పూర్తయినట్లే. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మర్రి శశిధర్ రెడ్డి కలిసారు. ఆయన వెంట బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణ కూడా ఉన్నారు.

కాంగ్రెస్ లో మొదటినుంచి ఉన్న సీనియర్ నేతల మాదిరే శశిధర్ రెడ్డి కూడ చాలకాలంగా హైకమాండ్ పై అసంతృప్తితో ఉన్నారు. మొదటినుంచి ఉన్నవారిని కాకుండా టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలను అప్పగించడం వీరెవరికీ నచ్చలేదు. దీనితో పార్టీతో అంటీ ముట్టనట్లుగా ఉన్నారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్దితి కూడ ఆశాజనకంగా కనిపించడం లేదు. హుజూర్ నగర్ , మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ డిపాజిట్లు కోల్పోవడం పార్టీ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.

మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారం రెండు రోజుల కిందటే వచ్చింది. అయితే శశిధర్ రెడ్డి ఈ వార్తలను ఖండించారు. తాను ఢిల్లీకి వెళ్లడం కొత్త కాదని, మనవడి స్కూల్ ఫంక్షన్ లో పాల్గొనేందుకు ఇప్పుడు వచ్చినట్లు చెప్పారు. తానింకా రాజకీయాల్లో ఉన్నానని, రిటైర్ కాలేదని మర్రి శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు. తాను వచ్చిన విమానంలో అన్ని పార్టీల నాయకులు ఉన్నారని తెలిపారు. ఆయన బీజేపీలో చేరేందుకే ఢిల్లీకి వచ్చానంటూ పుకార్లు పుట్టించడం సరికాదన్నారు.

Exit mobile version