Full powers to Hydra: హైడ్రాకు ఫుల్ పవర్స్ వచ్చాయి. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌పై తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. ఈ మేరకు హైడ్రా ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం తెలపడంతో తాజాగా, తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించిన గెజిట్ విడుదల చేసింది. దీంతో హైడ్రాకు చట్టబద్ధత వచ్చింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులు, నాలాలు, కుంలు, ప్రభుత్వ స్థలాలు, పార్కుల స్థలాల ఆక్రమణలను హైడ్రా కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే టాలీవుడ్ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ తో పాటు వందల ఇళ్లు, అక్రమ కట్టడాలను నేలమట్టం చేసింది.
ఇటీవల ఈ కూల్చివేత్తలపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించగా.. మరికొంతమంది తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూల్చివేత్తలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారించింది. ఈ మేరకు వివరణ ఇవ్వాలని హైడ్రా కమిషనర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కాగా, దీనిపై విచారణ 14న జరగనుంది.