Site icon Prime9

CPI Narayana : అమెరికా బెదిరింపులకు దిగడం సరికాదు : సీపీఐ నేత నారాయణ

CPI Narayana

CPI Narayana : డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత భారతీయులకు రక్షణ లేదని సీపీఐ నేత నారాయణ అన్నారు. అగ్రరాజ్యంలో తాజా పరిస్థితిపై గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ వివిధ దేశాల అధినేతలతో సమావేశాలకే పరిమితం అవుతున్నారని ఆరోపించారు. అగ్రరాజ్యం అమెరికా బెదిరింపులకు దిగడం సరికాదన్నారు. ఇతర దేశాల సంపదను కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. ఎలాన్ మాస్క్‌తో సమావేశం సందర్బంగా విధి రౌడీలాగా డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తన ఉందని ఎద్దేవా చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా అధ్యక్షుడికి వస్తున్న వ్యతిరేతను ఇండియా తరఫున ప్రధాని మోదీ ఉపయోగించుకోవాలని సూచించారు. లేకపోతే వంద కోట్ల భారతీయుల ప్రయోజనాలను అమెరికాకు తాకట్లు పెట్టినట్లు అవుతుందన్నారు. ప్రపంచ పెట్టుబడిదారులంతా ఏకమయ్యే ప్రమాదం ఉందని గుర్తుచేశారు. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. ఈ విషయమై మోదీతో ట్రంప్‌కు చెప్పించే బాధ్యత బాబు తీసుకోవాలని వ్యాఖ్యానించారు.

భారతీయులను వెనక్కి పంపిస్తున్న అమెరికా..
అగ్రరాజ్యం అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను అక్కడి సర్కారు వెనక్కి పంపిస్తోందన్నారు. ఇప్పటికే మిలిటరీ విమానంలో వందలాది మంది భారతీయులకు తిరిగి పంపించిందని గుర్తుచేశారు. ఈ అంశంపై ఇప్పటికే ప్రతిపక్షాలు కేంద్రంపై మండిపడుతున్నాయి. భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ ఇప్పటికే ఈ అంశంపై స్పందించారు. అక్రమ మార్గాల ద్వారా దేశంలోకి ప్రవేశించిన వారిని అమెరికా తిప్పి పంపిందన్నారు. వారంతా అమెరికా భద్రతకు ముప్పుగా పరిణమించిందని అమెరికా ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు.

ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగానే ఉంది..
ఎన్నికలకు ముందు ఒప్పందం ప్రకారం సీపీఐ పార్టీకి ఎమ్మెల్సీ సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగానే ఉందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ నాయకత్వానికి తమ అభిప్రాయాన్ని వివరించామన్నారు. వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. మరోవైపు ఇటీవల సీఎం రేవంత్‌ని సీపీఐ బృందం కలిసింది. రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. పొత్తులో భాగంగా తమకు రెండు ఎమ్మెల్సీ సీట్లు కాంగ్రెస్ ఇవ్వాల్సి ఉందని, అందులో ఒకటి ఎమ్మెల్యే కోటాలో ఇవ్వాలని కోరారు. గతంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలో రెండింటిలో ఒకటి సీపీఐ పార్టీకి ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేకపోయారు. ఈసారైనా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని అడిగారు. సీఎంతో భేటీ అనంతరం ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడారు. ఎమ్మెల్సీల కేటాయింపు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ ఏఐసీసీతో మాట్లాడి నిర్ణయం చెబుతామని చెప్పారని స్పష్టం చేశారు.

Exit mobile version
Skip to toolbar