Bairi Naresh: గతమూడురోజుల క్రితం కొండల్లో జరిగిన అంబేద్కర్ సభలో భైరి నరేష్ హిందూదేవుళ్లపై రెచ్చిపోయి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా హిందూమతాలు, అయ్యప్పమాలధారులు, బీజేపీ, భజరంగ్ దళ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయ్యప్ప స్వామి పుట్టుక, మరియు పురాణంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ అరెస్ట్ చెయ్యాలంటూ పెద్దఎత్తున నిరసనలు ధర్నాలు చేపట్టారు. కాగా నేటు అతన్ని వరంగల్ పోలీసులు ఎట్టకేలకు పోలీసులకు అరెస్ట్ చేశారు. అనంతరం కొడంగల్ కు తీసుకు వచ్చిన పోలీసులు స్థానిక మున్సిఫ్ కోర్టులో హాజరుపరిచారు.
నరేష్ సొంతూరు..
ఇకపోతే హనుమకొండ జిల్లా కమాలపూర్ మండలం కన్నూరు గ్రామపంచాయతీ పరిధిలోని రాములపల్లి గ్రామం నరేష్ సొంతూరు. కాగా అతను భారత నాస్తిక సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
complete story on bairi naresh
అయ్యప్ప దేవుడే కాదన్న నరేష్..
ఇదిలా ఉంటే అంబేద్కర్ సభలో బైరి నరేష్ మేము నాస్తికులం, దేవుళ్లను నమ్మం, అంబేద్కర్ సభ అంటేనే నాస్తికుల సభ అని బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. ఇక అంతటితో ఆగక అయ్యప్ప స్వామి పుట్టుక గురించి అవమానపరుస్తూ అసభ్యకర కామెంట్స్ చెయ్యడం రాష్ట్రవ్యాప్తంగా అగ్గిరాజేశాయి. అయ్యప్ప స్వామి దేవుడే కాదన్నాడు. అసలాయన పుట్టుకే ఒక గమ్మత్తు అంటూ కారుకూతలు కూశాడు. శ్రీరాముడు సైతం సీతను అష్టకష్టాలు పెట్టాడని, శ్రీకృష్ణుడిపై ఎనిమిది మందిని వివాహం చేసుకున్నాడని ప్రస్తావిస్తూ ఆ కాలంలో వారి ఆహారవ్యవహారాలను ఎత్తిచూపుతూ.. పురాణాలను కించపరుస్తూ అనేక వ్యాఖ్యలు చేశారు.
Bairi naresh’s family locked the house and left
ఈ వ్యాఖ్యలపై ఆగ్రహించిన అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాలు, భజరంగ్ దళ్, బీజేపీ పార్టీ నేతలు బైరి నరేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నరేష్ కు వ్యతిరేకంగా ధర్నాలు నిరసలు చేస్తూ పలు జిల్లాల పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేస్తున్నారు. దీనితో స్పందించిన పోలీసుల ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి మూడురోజుల గాలింపు అనంతరం ఆఖరికి నరేష్ ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.
ఎవరెలా స్పందించారంటే..
ఇకపోతే బైరి నరేష్ వ్యాఖ్యలు రాజకీయ రంగును పులుముకున్నాయి. నరేష్ వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవుళ్లను కించపరిచిన బైరి నరేష్‌పై కఠినచర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ట్వీట్ చేశారు. అటు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా నరేశ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. అతనిపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించాలని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరెడ్డి సైతం డిమాండ్ చేశారు.