CM Revanth Reddy Speech At Inauguration of Bio Asia 2025: హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో బయో ఏషియా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా హైదరాబాద్ మారిందన్నారు. ఈ సదస్సుకు 50 దేశాలకు చెందిన 3 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు.
లైఫ్ సైన్సెస్‌లో ఆధునిక మార్పులు, పురోగతిపై చర్చించనున్నట్లు తెలిపారు. క్యాటలిస్ట్ ఆఫ్ చేంజ్.. ఎక్స్‌పాండింగ్ గ్లోబల్ హెల్త్ కేర్ ఫ్రాంటీయర్స్ థీమ్‌తో సదస్సు జరుగుతోందన్నారు. ఏఐతో వచ్చిన మార్పులపై పరిశోధనే ఎజెండాగా ముందుకెళ్తుందన్నారు. హైదరాబాద్‌లో ప్యూచర్ సిటీ, ఏఐ సిటీ రానుందన్నారు.
లైఫ్ సైన్సెస్ భవిష్యత్తును నిర్దేశించే కొత్త ఆవిష్కరణలు, గ్లోబల్ బయో ఎకానమీని బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. యువతలో స్కిల్స్ పెంచేందుకు స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు. విద్యా రంగ అభివృద్ధికి పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నామన్నారు. అమెజాన్ కంపెనీ ప్రతినిధులతో భేటీ జరిగిందని సీఎం రేవంత్ చెప్పారు. దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌కు రావడానికి ఆసక్తి చూపుతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఈ సదస్సు రెండు రోజుల పాటు జరగనుంది.
భారత్‌లోనే హైదరాబాద్ అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్‌గా సెంటర్‌గా మారిందని వెల్లడించారు. రానున్న రోజుల్లో హైదరాబాద్‌ను మరింత సరికొత్త ఆవిష్కరణల సెంటర్‌గా మారుస్తామని చెప్పారు. తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించేలా చొరవ తీసుకుంటామని తెలిపారు. కాగా, లైఫ్ సైన్సెస్ రంగంలో క్వీన్స్ లాండ్ యూనివర్సిటీకి మంచి పేరుందన్నారు.
ఉద్యోగాల కల్పనలో దేశంలో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ ముందుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఇంటర్ నేషనల్ కంపెనీలు హైదరాబాద్‌కు వస్తున్నాయన్నారు. దీంతో సుమారు 5 లక్షల ఉద్యోగాలు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.