Site icon Prime9

kotha prabhakar Reddy: మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం

kotha prabhakar Reddy

kotha prabhakar Reddy

kotha prabhakar Reddy:మెదక్ ఎంపి, దుబ్బాక బిఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారంలో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కొత్త ప్రభాకర్ రెడ్డికి కడుపులో తీవ్ర గాయాలయ్యాయి. దాడి చేసిన వ్యక్తిని బిఆర్ఎస్ కార్యకర్తలు చితకబాదారు. గాయపడిన ప్రభాకర్ రెడ్డిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మద్యం మత్తులో నిందితుడు..(kotha prabhakar Reddy)

ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని గతాని రాజుగా గుర్తించారు. నిందితుడు ఎంపీ పై దాడి చేసినపుడు మద్యం మత్తులో ఉన్నాడని తెలుస్తోంది. ఒక యూట్యూబ్ ఛానెల్‌లో రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడని ఇటీవల బిజెపిలో చేరాడని తెలుస్తోంది. ఇలా ఉండగా దాడి జరిగిన వెంటనే ప్రభాకర్‌రెడ్డిని గజ్వేల్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ యశోదకు తరలించారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై దాడి సంగతి తెలియగానే మంత్రి హరీష్ రావు ఆయన ఆరోగ్యంపై ఆరా తీసారు. మెరుగైన చికిత్స కోసం హైదారాబాద్ తరలిస్తామని చెప్పారు. ఇలా ఉండగా దీనిపై దీనిపై సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేతారెడ్డి మాట్లాడుతూ.. రాజును అదుపులోకి తీసుకున్నాం. అతను మద్యం మత్తులో ఉన్నాడు. అతనికి కుటుంబ సమస్యలు కూడా ఉన్నాయని చెప్పారు.

 

Exit mobile version
Skip to toolbar