Site icon Prime9

Janga Krishnamurthy: ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు

Janga Krishnamurthy

Janga Krishnamurthy

Janga Krishnamurthy: ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి వైసీపీ షాక్ ఇచ్చింది . జంగా కృష్ణమూర్తి పై అనర్హత వేటు వేయాలని శాసనమండలి చైర్మన్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది. వైసీపీ నుంచి ఎమ్మెల్సీ గా ఎన్నికయి పార్టీ ఫిరాయించడంతో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని వైసీపీ కోరింది. ఈ మేరకు శాసనమండలిలో వైసీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేసిన శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేనురాజు.. ఎమ్మెల్సీ కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం అర్ధరాత్రి గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేశారు. శాసనమండలిలో జంగా కృష్ణమూర్తి కూడా ఒక విప్‌గా ఉండడం గమనార్హం .

వైసీపీ తరపున ఎమ్మెల్యే కోటాలో..(Janga Krishnamurthy)

జంగా కృష్ణమూర్తి 1999 ,2004 లో పల్నాడు జిల్లా గురజాల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత ఆయన్ని వైసీపీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసింది. అయితే, ఎన్నికల ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఏప్రిల్ 1న ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఏప్రిల్ 6న పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువాను కప్పుకున్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారడంతో అనర్హత వేటు పడింది .

Exit mobile version