Site icon Prime9

Former CM KCR : యశోదా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మాజీ సీఎం కేసీఆర్

Former CM KCR

Former CM KCR

 Former CM KCR : యశోదా ఆస్పత్రి నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. ఈ నెల 8న యశోదా ఆస్పత్రిలో చేరిన కేసీఆర్ కు వైద్యలు తుంటి ఎముక మార్పిడి చేశారు. అయితే ఆయనకు ఆరు నుంచి 8 వారాల రెస్ట్ ఇవ్వాలని తెలిపారు. విశ్రాంతి సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇక డిశ్చార్జ్ అనంతరం.. ఆయన బంజారాహిల్లో లోని నంది నగర్ నివాసానికి చేకున్నారు. అక్కడే ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఎనిమిదివారాలు విశ్రాంతి..( Former CM KCR )

డిసెంబరు 8న తెల్లవారుజామున ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్‌లోని బాత్‌రూమ్‌లో కేసీఆర్ జారిపడి పడిపోయారు. వెంటనే చికిత్స కోసం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు ఎడమ తుంటి ఎముకలో ఫ్రాక్చర్‌ను గుర్తించి, మొత్తం తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. వచ్చే ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుుతన్న సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు,మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, పలువురు మంత్రులు, మాజీ ప్రజాప్రతినిధులు కేసీఆర్ ను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Exit mobile version