Site icon Prime9

Khammam: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సెక్యూరిటీ తగ్గింపు

Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivas Reddy

Khammam: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సెక్యూరిటీని తగ్గించారు. గతంలో ఆయనకు 3+3 గన్ మెన్లు ఉండేవారు. ప్రస్తుతం ఆయన గన్ మెన్లను 2+2కి కుదించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయం వద్ద పైలెట్ సెక్యూరిటీని కూడ తొలగించారు.

ఈ నెల 1వ తేదీన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన అభిమానులు,సన్నిహితులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ సమ్మేళనంో పాల్గొన్నారు.ఈ సమ్మేళనంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తన అనుచరులంతా పోటీ చేస్తారని స్పష్టం చేశారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానన్నారు.

2018 ఎన్నికల్లో జిల్లాలోని బీఆర్ఎస్ అభ్యర్ధుల ఓటమికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కారణమనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎటువంటి పదవులు ఇవ్వలేదు. కొంత కాలంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతారని ప్రచారం సాగింది. కానీ తాను పార్టీ మారడం లేదని ఆయన స్పష్టం చేశారు.

Exit mobile version