Site icon Prime9

Election Bettings: ఏపీలో జోరుగా సాగుతున్న బెట్టింగులు

Election Bettings

Election Bettings

Election Bettings: ఏపీలో బెట్టింగ్ జోరు అందుకుంది .ఒక వైపు ఐపీఎల్ బెట్టింగ్ లు నడుస్తున్నాయి .తాజాగా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై బెట్టింగులు ఊపు అందుకున్నాయి .సహజంగా అగ్రనేతలు పోటీ చేసే చోట్ల బెట్టింగులు ఉంటాయి .కానీ ఈ సారి అగ్రనేతలు పోటీ చేసే స్థానాల్లో బెట్టింగులు జరగడంలేదు .అన్ని పార్టీల అగ్రనేతలు తప్పక గెలుస్తారనే టాక్ వచ్చేసింది.పులివెందులలో జగన్ ,కుప్పం లో చంద్రబాబు ,పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ,మంగళ గిరిలో లోకేష్ గెలుపుపై నమ్మకం కుదిరింది. దీనితో వీటి జోలికి బెట్టింగ్ రాజాలు వెళ్లడం లేదు.

హాట్ సీట్లలో బెట్టింగుల జోరు..(Election Bettings)

ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లో బెట్టింగులు జరుగుతున్నాయి .ఉండి లో మాజీ టీడీపీ ఎమ్మెల్యే కలవపూడి శివ ఇండిపెండెంట్ గా పోటీలో ఉండడంతో ఉండి పై బెట్టింగ్ బాగా జరుగుతోంది .అక్కడ కూటమి నుంచి ప్రస్తుత నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు టీడీపీ తరుపున పోటీ చేస్తున్నారు .అదేవిధంగా భీమవరం పై కూడా బెట్టింగ్ బాగానే నడుస్తోంది.గత ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచే పోటీచేసి ఓటమి చెందడం తెలిసిందే .ప్రస్తుతం ఇక్కడ నుంచి కూటమి తరుపున జనసేన పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే పులిపర్తి అంజిబాబు పోటీచేస్తుండడంతో ఈ నియోజకవర్గంపై ఆసక్తి పెరిగింది .వైసిపి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. అదే విధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల నుంచి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీ తరుపున రంగంలోకి దిగడంతో పోటీ ఆసక్తిగా మారింది.ఇక్కడ వైసీపీ నుంచి సీనియర్ నేత కారణం బలరాం కుమారుడు వెంకటేష్ బరిలో వున్నారు .మరో వైపు పిఠాపురం ,మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ,లోకేష్ మెజారిటీపై కూడా బెట్టింగులు నడుస్తున్నాయి .ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజోలు పై కూడా బెట్టింగ్ బాగానే నడుస్తోంది .గతంలో జనసేన గెలిచిన ఏకైక సీటు రాజోలు కావడం తో ఈసారి ఆ సీట్ నిలపెట్టుకుంటుందా లేదా అనేది ఆసక్తిగా మారింది .అక్కడ వైసీపీ నుంచి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పోటీచేస్తున్నారు .కడప పార్లమెంట్ పై కూడా బెట్టింగ్ బాగానే జరుగుతోంది .వైఎస్ తనయ షర్మిల కాంగ్రెస్ నుంచి బరిలో ఉండడం ,తల్లి విజయమ్మ కూడా కుమార్తెకు సపోర్ట్ చేయడం తో కడప పార్లమెంట్ పై బెట్టింగ్ రాజాలు దృష్టి పెట్టారు .వైసీపీ అభ్యర్థి అవినాష్ పై సొంత కుటుంబ సభ్యులే వ్యతిరేకంగా ప్రచారం చేయడం తో పరిస్థితి తారుమారు అవుతుందనేది ఒక వాదన.

Exit mobile version