Site icon Prime9

Adilabad RIMS: అదిలాబాద్ రిమ్స్ లో కొనసాగుతున్న వైద్య విద్యార్థుల ఆందోళన

Adilabad Rims

Adilabad Rims

Adilabad RIMS: అదిలాబాద్ రిమ్స్ కళాశాలలో వైద్య విద్యార్థులు రెండో రోజు బైఠాయించి వైద్య విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. అత్యవసర సేవలు తప్ప మిగతా విధులను జూనియర్ డాక్టర్లు బహిష్కరించారు. రిమ్స్ డైరక్టర్ జైసింగ్ రాథోడ్‌ని తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

దాడి ఘటనపై విచారణ..(Adilabad RIMS)

రిమ్స్ మెడికోలపై దాడి ఘటనపై విచారణ కమిటీ రంగంలోకి దిగింది. డీఎంఈ ఆదేశాలతో నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రొఫెసర్లు శివ ప్రసాద్, వివి రావ్ బృందం రిమ్‌కి చేరుకుంది. జరిగిన ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. రిమ్స్ మెడికల్ కాలేజీ హాస్టల్స్ లోకి బయట వ్యక్తులు ఎందుకు వచ్చారు.? ఎలా వచ్చారు.? వైద్య విద్యార్ధులపై ఎందుకు దాడి చేశారు.? దానిని ప్రోత్సహించింది ఎవరు.? ఎవరి ప్రమేయం ఎంత ఉంది అన్న అంశాలపై అందరితో మాట్లాడి నివేదిక సిద్ధం చేస్తామని బృంద సభ్యులు వివరించారు.నిరసన చేస్తున్న విద్యార్థులకు బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న, బీఆర్‌ఎస్‌ నాయకులు మద్దతు తెలిపారు. డాక్టర్ క్రాంతిని తొలగించాలంటూ విద్యార్థులు విధులు బహిష్కరించి కలెక్టర్ కార్యాలయం ఎదుట రెండు గంటలపాటు ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్‌ తాత్కాలికంగా నిలిచిపోయింది.

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జోక్యం చేసుకుని విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం దీనిపై విచారణ జరిపి సమగ్ర విచారణ నివేదికను సమర్పించేందుకు అదనపు కలెక్టర్ శ్యామలాదేవి నేతృత్వంలో కమిటీని నియమించారు. ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు ముగ్గురు నిందితులు – డాక్టర్ ఎ క్రాంతి కుమార్, వసీం, శివ, రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్‌పై సెక్షన్ 337, 447, 307 r/w 34 IPC కింద కేసు నమోదు చేశారు. నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు సీసీటీవీ ఫుటేజీని ఉపయోగించి విచారణ జరుపుతున్నారు.రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ క్రాంతి కుమార్‌ను కాంట్రాక్టు సేవల నుండి వెంటనే తొలగించారు. అనంతరం అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Exit mobile version