Site icon Prime9

kesineni Nani: కేశినేని నానికి చంద్రబాబు షాక్ .. ఎంపీ టికెట్ గాయబ్

kesineni Nani

kesineni Nani

kesineni Nani: విజయవాడ ఎంపి కేశినేని విషయంలో టిడిపి అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. కేశినేని నానికి పోటీగా ఆయన తమ్ముడు కేశినేని చిన్నిని టిడిపి అధిష్టానం ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో మొన్న తిరువూరు నియోజకవర్గ సమావేశంలో కేశినేని బ్రదర్స్ వర్గీయుల మధ్య రేగిన గొడవ పరస్పర దాడుల వరకూ దారి తీసింది. దీంతో అధిష్టానం ఇక లాభం లేదనుకుంది. వివాదానికి తెరదించాలనుకుంది. నేరుగా కేశినేని నాని వద్దకి అధిష్టానం దూతలు వెళ్ళారు.

అధినేత ఆదేశాలను పాటిస్తాను..(kesineni Nani)

ఈ సారి ఎంపీగా పార్టీ టికెట్ ఇవ్వడం లేదని చంద్రబాబు మనసులో మాటని నేరుగా కేశినేని నానికి చెప్పేశారు. ఈ నెల 7వ తేదీన తిరువూరులో జరిగే సభకి వేరే వారిని ఇంచార్జ్‌గా నియమిస్తున్నామని నానికి తెగేసి చెప్పారు. విజయవాడ ఎంపిగా వేరే వారికి అవకాశం ఇస్తున్నారని వెల్లడించారు. పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని సూచించారు. ఈ విషయాన్ని అధిష్టానం తరపు దూతలైన మాజీమంత్రులు ఆలపాటి రాజా, నెట్టెం రఘురాం, మాజీఎంపీ కొనకళ్ల నారాయణ తనకు చెప్పారని వివరించారు. పార్టీ అధినేత ఆదేశాలను శిరసావహిస్తానని సోషల్ మీడియా వేదికగా కేశినేని నాని తెలిపారు.

మొన్న తిరువూరు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఎంపీ హోదాలో కేశినేని నాని ఫొటోని ముద్రించలేదు. దీనిపై తెలుగు తమ్ముళ్ళు బాహాబాహీకి దిగారు. ఫ్లెక్సీలలో ఎంపి కేశినేని నాని ఫొటో లేకుండా కేశినేని చిన్ని ఫొటో ఉండటంతో కొంతమంది పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫ్లెక్సీలు చించి కుర్చీలు విసిరేశారు. పెద్ద ఎత్తున గొడవ చేశారు. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి శావల దేవదత్తుపై కార్యకర్తలు దాడికి దిగారు. దీంతో అధిష్టానం రంగలోకి దిగి కేశినేని నానిని పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశించింది.

Exit mobile version
Skip to toolbar