Site icon Prime9

AP temples: ఏపీలోని ప్రముఖ దేవాలయాల్లో ఆన్ లైన్ సేవలు ప్రారంభం

AP temples

AP temples

Online services: ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ​దేవాలయాల్లో ఆన్‌లైన్‌ సేవలను దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రారంభించారు. సీఎం జగన్ సూచనల మేరకు అన్ని దేవాలయాల్లో దశలవారీగా ఆన్‌లైన్ సేవలు విస్తరిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే శ్రీశైలంలో ఆన్ లైన్ సేవలని నైన్ అండ్ నైన్ సంస్ధ సహకారంతో చేపట్టామన్నారు. శ్రీశైలంలో విజయవంతం‌ కావడంతో ఇపుడు ప్రముఖ దేవాలయాల్లో ఆన్‌లైన్ సేవలు ప్రారంభించామని చెప్పారు. క్యూ లైన్ నిర్వహణ కూడా ఈ యాప్ ద్వారా చేస్తామని మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు.

ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం, విశాఖపట్నం, శ్రీకాళహస్తి, కాణిపాకం, పెనుగంచిప్రోలు ఆలయాల్లో కూడా ఆన్‌లైన్ సేవలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయని తెలిపారు. ఆలయ భూములు, ఆభరణాల పై జియో ట్యాగింగ్ చేయనున్నాం. ఆర్థిక లావాదేవీలన్నీ పారదర్శకంగా జరిగేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నామని, దీనివల్ల ఎలాంటి అవినీతికి తావులేకుండా పోతుంది. భక్తులు ఆన్‌లైన్ మోడ్ ద్వారా గదులు, దర్శన టిక్కెట్లు, సేవాలు, ఇ-హుండీ మరియు ఇతర సేవలను బుక్ చేసుకోవచ్చు. భక్తుల సేవలు ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లో కూడా కొనసాగుతాయి. అని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.

రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో ఎన్నో అక్రమాలు, అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయని నిత్యం పలు ఆరోపణలు, వార్తలు వస్తున్నాయని, వీటన్నింటినీ అరికట్టేందుకు ఈ ఆన్ లైన్ విధానం ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు.

Exit mobile version