Janasena Formation Day: ప్రజలకు సేవ చేయడానికే జనసేన పుట్టిందని పవన్ కళ్యాణ్ అన్నారు. మచిలీ పట్నం నిర్వహించిన జనసేన పదో ఆవిర్భావ సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రశ్నించడం కోసమే ప్రజల పక్షాన నిలబడి వారికి అండగా జనసేన అండగా ఉంటుందని అన్నారు.
పదేళ్ల ప్రస్థానంలో ఎన్నో చూశాం.. (Janasena Formation Day)
జనసేన ఆవిర్భాంచి పది సంవత్సరాలు పూర్తైన సందర్భంగా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతామని అన్నారు. జనసేన పార్టీ పెట్టినప్పుడు తనతో కొద్దిమంది మాత్రమే ఉన్నారని.. ఆ సమయంలో రాజకీయాలు ఎలా చేయాలో తనకు తెలియదన్నారు. చిన్నప్పటి నుంచి సమాజ శ్రేయస్సు గురించి ఆలోచనతోనే ప్రజల్లోకి వచ్చినట్లు తెలిపారు. అభిమానులు ఇచ్చిన ధైర్యం.. సమాజంలో జరుగుతున్న చెడును చూసే పార్టీని స్థాపించినట్లు తెలిపారు. ఈ పార్టీ ఏర్పాటుకు స్వాతంత్ర్య సమరయోధులను స్పూర్తిగా తీసుకున్నట్లు ఆయన అన్నారు. సగటు మనిషికి న్యాయం చేయాలన్నదే తల తపన అని సభావేదికగా తెలిపారు.
ప్రతి కులానికి అండగా ఉంటాం..
జనసేన అధికారంలోకి వస్తే ప్రతి కులానికి అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. గతంలో కమ్మ, కాపు, బీసీ కులాల గురించి మాట్లాడలేకపోయేవాడిని. కానీ ఇది సత్యం. ప్రస్తుత పరిస్థితుల్లో పీడితుల పక్షాన నిలబడాల్సిన అవసరం వచ్చిందన్నారు. నన్ను కులం పేరుతో దూషిస్తారని.. కానీ అలాంటి మాటలను తాను పెద్దగా పట్టించుకోనని పవన్ అన్నారు. కొన్ని సందర్భాల్లో కొందరు కులాన్ని అమ్మేస్తానంటే బాధగా ఉంటుందని తెలిపారు. నేను విశ్వనరుడిని. అంతా బాగుండాలని కోరుకునేవాడిని. కులాల మధ్య చిచ్చుపెట్టలేను. అల్పసంఖ్యాక కులాలు బాగుండాలని భావించేవాడిని. 60 కి పైగా కులాలకు అన్నీ సమస్యలే. ఈ కులాల నుంచి మేధావులు వస్తారు. అలాంటిసమూహాన్ని నాయకులుగా చేయడానికి పార్టీ పెట్టాం. కుల కార్పొరేషన్లు పెట్టారు. అవి ఎందుకు ఉపయోగం లేదు. ఇలాంటివి మారాలి అన్నారు పవన్ కళ్యాణ్.
ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ ఎస్టీ, కాపులు, బీసీలు అధిక సంఖ్యలో ఉన్నా.. దేహీ అనే పరిస్థితి వచ్చిందని అన్నారు. దీనికి కారణం.. వైసీపీ వ్యవహరిస్తున్న తీరు నిదర్శనమని వివరించారు.
కులాల్లో ఉన్న అనైక్యత. మీరు ఐక్యత సాధిస్తే మీరు రిజర్వేషన్లు మీరే తెచ్చుకుంటారు. మీరు స్వతంత్రంగా ఉండగలుగుతారు. అలాంటి కులాలకు మేం అండగా ఉంటాం.
మీరు బయటకు రండి.. కలిసి పోరాడండి అని జనసేన కార్యకర్తలకు పిలుపనిచ్చారు. పాలనలో ఒక కులం పెత్తనం ఆగిపోవాలి.
ఆంధ్రప్రదేశ్ లో.. దీనికి అన్ని కులాలకు సమాన ప్రాతినిధ్యం తీసుకొస్తామని అన్నారు. అగ్రకులాలకు కూడా రిజర్వేషన్లు కావాలని ఈ సందర్భంగా పవన్ గుర్తు చేశారు.
అగ్రకులంలో పేదల గురించి ఆలోచించాలి. గంజి అన్నం తాము తిని పిల్లలకు కూరలు పెట్టారు. మంచి ర్యాంకులు వచ్చినా చదవలేకపోవడం చూశాం.
ఇలాంటి అడ్డంకులు నేను చూశాను. నాకు ఈ దేశం అన్యాయం చేస్తోందన్నా బాధ ఉంది. అగ్రకులంలో పేదలకు అండగా ఉంటాం.
స్కాలర్ షిప్పులు, ఫీజు రీఎంబర్స్ మెంట్ కి ప్రయత్నిస్తాం.
రిజర్వేషన్ అనేది రాజ్యాంగం ఇచ్చిన వరమని పవన్ అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికల్లో 150 కోట్లు ఖర్చుపెడతారు.
కానీ పేదలకు ఒక్క 10 లక్షలు కూడా ఇవ్వలేరా అని యువతను ప్రశ్నించారు.
యువత జనసేనకు అండగా నిలబడితే మీకు అండగా నేనుంటానని పవన్ హామీ ఇచ్చారు.
నాకు వెయ్యి కోట్లు ఆఫర్ చేశారని.. కొందరు విష ప్రచారం చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. జనసేన అధినేతను ఏ పార్టీ డబ్బుతో కొనలేదని అన్నారు.
నేను వేసుకున్న చెప్పులు.. ఇక్కడ తయారు చేసినవే అని అన్నారు. తప్పుడు ప్రచారం చేస్తే.. చెప్పుతో కొడతా అని వార్నింగ్ ఇచ్చారు. నాకు డబ్బు అవసరం లేదు.
నేను సినిమాకు 40 కోట్ల వరకూ చూసుకుంటాను. మీరిచ్చిన స్థాయి ఇది. నేను సంపాదించుకోలేనా? అని వైసీపీకి చురకలంటించారు.