Botsa Satyanarayana: విశాఖ విమానాశ్రయంలో సీఎం వైఎస్ జగన్‌పై జరిగిన దాడి వాస్తవమని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆ దాడిని స్వయంగా జగన్ చేయించుకున్నారనే భావన కల్పిస్తున్నారని మండిపడ్డారు. కోడి కత్తి కేసులో ఎన్‌ఐఏ రిపోర్టును కొన్ని వార్తా సంస్థలు వక్రీకరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి అలిపిరి వద్ద టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నక్సల్స్ దాడి చేశారని.. అయితే రాజకీయ లబ్ధి కోసం ఆయనే ఆ దాడి చేయించుకున్నారా? అని ఎదురు ప్రశ్నించారు. కోడికత్తితో దాడికి పాల్పడిన నిందితుడు శ్రీనివాస్ ఎలాంటి ఉద్దేశంతో అలా చేశాడో తెలియాల్సి ఉందని చెప్పారు. జగన్‌పై జరిగిన దాడి ఘటనపై సమగ్ర విచారణ జరపాలన్నదే వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.
అందులో నిజం లేదు: బొత్స(Botsa Satyanarayana)
‘విశాఖ ఉక్కు ప్లాంట్ పై వైఎస్సార్సీపీ విధానం ఒక్కటే. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది మా నినాదం. ప్రైవేటీకరణకు మా ప్రభుత్వం వ్యతిరేకం. ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆపేయాలని పోరాడుతున్నాం. అఖిలపక్ష పార్టీలకు చిత్తశుద్ధి లేదు. అందుకే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశాన్ని దిల్లీకి తీసుకువెళ్లటం లేదు. అఖిలపక్ష పార్టీలపై మాకు నమ్మకం లేదు. బీఆర్ఎస్ దెబ్బకు ఉక్కు ప్రైవేటీకరణ నిలిచిపోయిందనేది అవాస్తవం. బీఆర్ఎస్, జనసేన కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. రాష్ట్రం పట్ల, అభివృద్ధిపై టీడీపీ కి చిత్తశుద్ధి లేదు. అందుకని మేమే ఒంటరిగా పోరాటం చేస్తున్నాం’ అని బొత్స వెల్లడించారు.
వాంగ్మూలంలో కీలక విషయాలు
కోడికత్తి కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఎన్‌ఐఏకి ఇచ్చిన వాంగ్మూలంలో కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు కీలక విషయాలు వెల్లడించాడు. జాతీయ దర్యాప్తు సంస్థకి ఇచ్చిన వాంగ్మూలం తాజాగా వెలుగుచూసింది. ప్రజల్లో జగన్ కు సానుభూతి రావాలనే దాడి చేసినట్లు పేర్కొన్నాడు. ఆయన ముఖ్యమంత్రి కావాలనేదే తన ఉద్దేశమని వాంగ్మూలంలో తెలిపాడు.
కోడికత్తి కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఎన్‌ఐఏకి ఇచ్చిన వాంగ్మూలంలో కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు కీలక విషయాలు వెల్లడించాడు. ప్రజల్లో జగన్ కు సానుభూతి రావాలనే దాడి చేసినట్లు పేర్కొన్నాడు. ఆయన ముఖ్యమంత్రి కావాలనేదే తన ఉద్దేశమని వాంగ్మూలంలో తెలిపాడు.
జగన్‌కు ప్రాణహాని జరగవద్దనే.. భుజంపై పొడవాలని ముందుగానే నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. నొప్పి రాకుండా.. కోడికత్తికి రెండుసార్లు స్టెరిలైజ్ చేసినట్లు వెల్లడించాడు. కత్తి దాడి తర్వాత.. ఏమీ కాదులే అన్నా! అని జగన్ కి చెప్పినట్లు వెల్లడించాడు. మెుదటి నుంచే తాను వైఎస్ రాజశేఖర్ అభిమానినని తెలిపాడు. 2019 ఇచ్చిన వాంగ్మూలం ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది.
జగన్ పాదయాత్ర వల్ల.. ఆయనపై అభిమానం పెరిగినట్లు.. ఆయన అధికారంలోకి వస్తే రాష్ట్రం తలరాత మారుతుందని అందుకే అలా చేశానని చెప్పాడు. భుజాలపై కోడికత్తితో దాడి చేసిన ప్రాణహాని ఉండదని అందుకే ఆలా చేశానని అందులో వివరించాడు. దీనివల్ల జగన్‌కు సానుభూతి లభించి, ఆయన ముఖ్యమంత్రి అవుతారని ఊహించినట్లు చెప్పాడు.