Prime9

Bill Gates – CM Chandrababu: సీఎం చంద్రబాబుకు బిల్‌గేట్స్‌ లేఖ!

Bill Gates letter to CM Chandrababu: ఢిల్లీలో గేట్స్‌ ఫౌండేషన్‌తో జరిగిన ఒప్పంద సమావేశాన్ని ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబుకు మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్‌ లేఖ రాశారు. ఒప్పందం కోసం చంద్రబాబు చూపిన చొరవను అభినందించారు. తన బృందంతో డిల్లీకి వచ్చిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.. మంచి వాతావరణంలో చంద్రబాబుతో సంప్రదింపులు జరిపామని.. వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధికి, పేదల విద్య, ఆరోగ్యంపై ఒప్పందం చేసుకోవడాన్ని అభినందిస్తున్నామని బిల్‌గేట్స్‌ లేఖలో తెలిపారు.

 

పేదలు-అట్టడుగువర్గాల విద్య, ఆరోగ్యంలోనూ… వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధిపైనా గేట్స్ ఫౌండేషన్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడాన్ని అభినందిస్తున్నానని అన్నారు. ఆరోగ్యరంగాన్ని పటిష్ట పరచడం, హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్, ఏఐ అసిస్టెడ్ క్లినికల్ డిసిషన్ మేకింగ్, మెడ్‌టెక్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దడంపై చర్చ జరిగిందని చెప్పారు. వ్యవసాయంలో నాణ్యమైన విత్తనాల తయారీ, సాయిల్ హెల్త్ మోనిటరింగ్, తల్లీబిడ్డల ఆరోగ్యానికి మైక్రోన్యూట్రీయంట్లు అందించే అంశాలపై చర్చించామన్నారు. పాలనలో టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ను బలోపేతం చేసేందుకు, మెరుగైన సేవలు అందించేందుకు సీఎం చంద్రబాబు చూపిన ఆసక్తి.. తన చిత్తశుద్ధి, విజన్‌కు నిదర్శనమని బిట్ గెట్స్ కొనియాడారు.

Exit mobile version
Skip to toolbar