Prime9

Breathing Exercises: ఆందోళనతో బాధపడుతున్నారా? అందుకు నివారణలు ఇవే.!

Stress Relief Breathing Exercises In Telugu: మనసు ఆందోళనగా ఉంటే ఏ పనీ చేయలేం. ఆపై రక్త ప్రసరణపై ప్రభావం పడుతుంది.  ఆందోళనను శాంతపరచడానికి శ్వాసపై నియంత్రణ చాలా అవసరం. ముఖ్యంగా ప్రాణాయామంలో చెప్పబడిన శ్వాస సూత్రాలను పాటించాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, 2019లో, దాదాపు 30కోట్ల మంది ఆందోళ అనే వ్యాదికి గురయ్యారు. ఇది ప్రపంచ జనాబాలో 4శాతం. కోవిడ్ కాలంలో ప్రజలల్లో ఆందోళన చాలా పెరిగిందని రిపోర్టులు చెబుతున్నాయి. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 25శాతం మంది ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. అందోళన అనేది ఏదో కోల్పోతున్నామనే భావనలోంచి పుడుతుంది. కరోనా సమయంలో మనుషుల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారాయి. దీంతో మనుషులకు భయం పట్టుకుంది.

ఆందోళనను కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం. ఇందుకు బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ లు ఉన్నాయి. ముఖ్యంగా బాక్స్ బ్రీతింగ్ పద్దతి పాటిస్తే త్వరగా ఉపశమనం లభిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. బాక్స్ బ్రీతింగ్ లో 4-4-4-4 పద్దతిని పాటించాలి. 4 సెకన్ల పాటు శ్వాసను తీసుకోవాలి, 4 సెకన్ల పాటు గాలిని వదిలేయాలి, ఆపై మళ్ళీ 4 సెకన్ల పాటు మీ శ్వాసను తీసుకోవాలి. ఇది నాడీ వ్యవస్థను నియంత్రించడంలో సహాయపడుతుంది.

డయాఫ్రాగ్మాటిక్ బ్రీతింగ్ 
దీనిని కూర్చుని లేదా పడుకుని చేయవచ్చు. ముందుగా ఒక చేతిని మీ ఛాతీపై మరియు మరొక చేతిని మీ పొట్టపై ఉంచండి. ముక్కు ద్వారా గాలిరి లోతుగా శ్వాస తీసుకోండి. ఆపై నెమ్మదిగా వదలండి, ఇది భారతీయ పద్దతిలో శ్వాసతీసుకునే వ్యాయామంలో ప్రముఖమైనది.

4-7-8 శ్వాస
4 సెకన్ల పాటు గాలిని పీల్చి, 7 సెకన్ల పాటు శ్వాసను పట్టి ఉంచాలి మరియు 8 సెకన్ల పాటు నోటి ద్వారా నెమ్మదిగా గాలిని వదలాలి. ఇది మీ ఆందోళనను తగ్గించడానికి సహాయపడుతుంది. గాలిని బందించడం ద్వారా మీ మెదడుకు ఆక్సీజన్ ను అందిస్తుంది. దీంతో మీ మెదడులోని రక్త నాలాలు సరిగ్గా పనిచేస్తాయి. అయితే ఈ శ్వాస వ్యాయామాన్ని నిపులు సహాయంతో నే చేయాలి. దీన్ని పూరక, కుంబక, రేచకాలు అంటారు. ఈ ప్రక్రియను మన పూర్వీకులు పాతకాలంనుంచే సాధన చేస్తూ ఉన్నారు.

గమనిక.. పైన చెప్పిన విషయాలు నిపుణుల సహాయంతో, వారి ఎదుటనే చేయాలి. సొంతగా ప్రయోగాలు చేయకూడదు. కచ్చితత్వానికి చానల్ బాధ్యత వహించదు.

Exit mobile version
Skip to toolbar