Site icon Prime9

Side Effects of Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్ ఎక్కువగా తాగకండి.. ఈ సమస్యలు కొనితెచ్చుకోకండి!

Beetroot Juice

Beetroot Juice

Side Effects of Beetroot Juice: బీట్‌రూట్ జ్యూస్ ఆరోగ్యానికి ఒక అద్భుతమైన ఔషధం లాంటిది. ఇది శరీరంలో రక్తాన్నిపెంచడంలో సహాయపడటమే కాకుండా.. తక్షణ శక్తిని అందిస్తుంది. బీట్ రూట్ జ్యూస్ లో ఉండే పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. కానీ బీట్ రూట్ జ్యూస్ ఎక్కువగా తాగినా కూడా ప్రమాదకరమే అని డాక్టర్లు చెబుతున్నారు. మరి ఇందుకు గల కారణాలు ఏంటో తెలుసుకుందామా..

 

బీట్‌రూట్‌లో లభించే పోషకాలు:
బీట్‌రూట్ చాలా ఆరోగ్యకరమైన కూరగాయ. దీనిని సాధారణంగా సలాడ్ లేదా జ్యూస్ రూపంలో తీసుకుంటారు. ఇందులో ఐరన్, ఫోలిక్ యాసిడ్, ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి.

 

బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల కలిగే నష్టాలు:

 

జీర్ణ సమస్యలు : కొంతమందికి బీట్‌రూట్ జ్యూస్ తాగిన తర్వాత గ్యాస్ లేదా విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి.

మూత్రపిండాల్లో రాళ్లు : బీట్‌రూట్‌లో ఆక్సలేట్ అనే మూలకం ఉంటుంది. అందుకే బీట్ రూట్ జ్యూస్ ఎక్కువగా తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి.

 

అలెర్జీలు : కొంతమందికి బీట్‌రూట్‌ అంటే అలెర్జీ ఉంటుంది. దీని వలన దురద, వాపు లేదా దద్దుర్లు వంటి చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి.

 

రక్తపోటు : బీట్‌రూట్ జ్యూస్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. కానీ బీపీ తక్కువగా ఉన్నవారు ఎక్కువగా ఈ జ్యూస్ తాగితే.. సమస్య మరింత తీవ్రంగా మారుతుంది.

 

గర్భిణీ స్త్రీలు : గర్భిణీ స్త్రీలు బీట్‌రూట్ జ్యూస్ తాగే ముందు తప్పనిసరిగా డాక్టర్లను సంప్రదించాలి.

 

బీట్‌రూట్ జ్యూస్ తాగడానికి సరైన సమయం:
బీట్‌రూట్ జ్యూస్ తాగడానికి సరైన సమయం తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. దీనిని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం ఉత్తమం . ఉదయం  మాత్రమే శరీరం దానిని సులభంగా జీర్ణం చేసుకోగలదు. దీంతో పాటు, వ్యాయామం లేదా యోగా చేయడానికి 30 నుండి 45 నిమిషాల ముందు ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుంది. భోజనానికి అరగంట ముందు దీనిని తీసుకోవడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. అంతే కాకుండా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.

 

 

Exit mobile version
Skip to toolbar