Prime9

Juice For kidney detox: కిడ్నీలను రక్షిస్తూ యూరిన్ సమస్యలను పోగొట్టే జ్యూస్ ఇదే..!

Best Juice For Kidney Detox In Telugu: మనిషి శరీరంలోంచి మలినాలు బయటకు వెళ్లాలంటే కిడ్నీలు శక్తివంతంగా పనిచేయాలి. కిడ్నీలు ఫిల్టర్ చేసిన తర్వాత అన్ని టాక్సిన్ లు యూరిన్ ద్వారా వెళ్లిపోతాయి. మనిషి జీవితంలో కిడ్నీల పాత్ర చాలా ఉంటుంది. కాబట్టి కిడ్నీలను రక్షించుకుంటూ, వాటికి శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకున్నట్లయితే మనిషి జీవన ప్రమాణం పెరుగుతుంది. ఒక్క సారి కిడ్నీలపై ఎఫెక్ట్ మొదలైందంటే శరీరంలోని అన్ని అవయవాలపై ప్రభావం కనపడుతది. కాబట్టి కిడ్నీలకు శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి.

 

 

కొన్ని రకాల జ్యూస్ లను తీసుకుంటే కిడ్నీలు క్లీన్ అవుతాయి. మూత్రపిండాలను వీటితో డిటాక్స్ చేసుకుంటే పనితీరు మెరుగవుతుంది. ఒక సారి ఈ ఆయుర్వేదిక్ జ్యూస్ లను ఎలా తయారు చేసుకోవాలో ఒక సారి చూద్దాం.

 

carrot juice

carrot juice

యూరిక్ యాసిడ్ శరీరంలో పేరుకుపోయినప్పుడు కిడ్నీలపై ప్రభావం చూపెడుతుంది. శరీరమంతా నీరు పెరుగుతుంది. కీళ్లలో అరుగుదల కనిపిస్తుంది. వాపువస్తుంది. మూత్రంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మూత్రంలో మంటలు, నొప్పి రావడం జరుగుతాయి. వీటిని పరిష్కరించుకోవడానికి చిన్నచిన్న చిట్కాలు పాటించడం ఎంతో అవసరం. మూడు తినే పదార్థాలతో జ్యూస్ చేసుకుని తాగినట్లయితే మూత్రం లీక్ కావడం, యూరిక్ యాసిడ్ తగ్గుముకం పడతాయి. ఇవి ముఖ్యంగా పెద్దవయసు వాళ్లలో ఎక్కువగా కనిపిస్తాయి.

 

 

కిడ్నీలను శుభ్రం చేయాలంటే సులువుగా మూడు పదార్థాలతో జ్యూస్ చేసుకుని తాగాలి. అందులో క్యారెట్, కీరదోసకాయ, నిమ్మకాయ ఉంటే సరిపోతుంది. కిడ్నీలు శుభ్రం చేసుకోవాలన్నా, మూత్రసమస్యను పరిష్కరించుకోవాలన్నా, యూరిక్ యాసిడ్ ను తగ్గించుకోవాలనుకున్నా ఈ జ్యూస్ ను తాగాలి. ముందుగా జ్యూస్ ను ఎలా చేయాలో చూద్దాం.
కీరా దోసకాలయను తీసుకుని పొట్టు తీసేసి గుండ్రంగా తరగాలి, క్యారెట్ ను కూడా అదేవిదంగా తరగాలి, అందులో నిమ్మకాయ రసాన్ని వేయడానికి దాన్ని కూడా కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి.

 

cucumber juice

cucumber juice

 

ముందుగా క్యారెట్, కీరాదోసకాయల ముక్కలను మిక్సీలో వేసుకుని జ్యూస్ చేసుకోవాలి. దానిలో సరిపడినంత నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న జ్యూస్ ను రెండు మూడు రోజులకు ఒక సారి తీసుకుంటే సరిపోతుంది. ఒక నెలలో నాలుగు ఐదు సార్లు తాగవచ్చు. అదేపనిగా తాగకూడదు. ఆయుర్వేదం నుంచి వచ్చిన ఏ చిట్కా అయినా ఎక్కువగా వాడకూడదు.

 

 

ఈ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. కిడ్నీలను రిఫ్రెష్ చేస్తాయి. జ్యూస్ కాకుండా రోజూ క్యారెట్ ను విడిగా తినవచ్చు, కీరాదోసకాయను కూడా విడిగా తినవచ్చు.

Exit mobile version
Skip to toolbar