Site icon Prime9

Today Panchangam : నేటి (మార్చి 25, శనివారం) పంచాంగం వివరాలు..

today panchangam details on november 11 2023

today panchangam details on november 11 2023

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో ఫాల్గుణ శుద్ధ మాసంలో నేటి (మార్చి 25 ) శని వారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రీయ మితి ఫాల్గుణం , శాఖ సంవత్సరం 1944, ఛైత్ర మాసం, శుక్ల పక్షం, చతుర్థి తిథి, విక్రమ సంవత్సరం 2079. రంజాన్ 02, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 25 మార్చి 2023. సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు. చతుర్థి తిథి సాయంత్రం 4:24 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పంచమి తిథి ప్రారంభమవుతుంది. భరణి నక్షత్రం మధ్యాహ్నం 1:09 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత కృత్తిక నక్షత్రం ప్రారంభమవుతుంది. విష్కుంభ యోగం అర్ధరాత్రి 12:19 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ప్రీతి యోగం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు మేషం నుంచి రాశి వృషభరాశి రాశిలోకి సంచారం చేయనున్నాడు.

నేటి ఉపవాస పండుగ : కూష్మాంఢ ఆరాధన, ఛైత్ర వినాయక చతుర్థి

సూర్యోదయం సమయం 25 మార్చి 2023 : ఉదయం 6:20 గంటలకు

సూర్యాస్తమయం సమయం 25 మార్చి 2023 : సాయంత్రం 6:35 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే (Today Panchangam)..

అభిజీత్ ముహుర్తం : ఈరోజు మధ్యాహ్నం 12:03 గంటల నుంచి మధ్యాహ్నం 12:52 గంటల వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:19 గంటల వరకు

నిశిత కాలం : అర్ధరాత్రి 12:30 గంటల నుంచి రాత్రి 12:50 గంటల వరకు

సంధ్యా సమయం : సాయంత్రం 6:34 గంటల నుంచి సాయంత్రం 6:57 గంటల వరకు

అమృత కాలం : ఉదయం 8:32 గంటల నుంచి ఉదయం 10:07 గంటల వరకు

రవి యోగం : ఉదయం 6:20 గంటల నుంచి మధ్యాహ్నం 1:19 గంటల వరకు

(Today Panchangam) నేడు అశుభ ముహుర్తాలివే..

రాహూకాలం : ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు

గులిక్ కాలం : ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7:30 గంటల వరకు

యమగండం : మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

దుర్ముహుర్తం : ఉదయం 6:20 గంటల నుంచి ఉదయం 7:58 గంటల వరకు

భద్ర కాలం : ఉదయం 6:20 గంటల నుంచి సాయంత్రం 4:23 గంటల వరకు

నేటి పరిహారం : ఛైత్ర నవరాత్రుల్లో నాలుగో రోజున దుర్గా సప్తశతి నాలుగో అధ్యయాన్ని పఠించాలి. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి.

Exit mobile version