Horoscope Today in Telugu January 22: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలాంటి పనులు చేయాలి? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు.
మేషం – చేస్తున్న పనులలో కాలయాపన అంతరిస్తుంది. అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. ప్రభుత్వపరంగా, వ్యక్తుల పరంగా రావలసిన ప్రయోజనాలు దక్కుతాయి. స్వల్ప ధన లాభం.
వృషభం – ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి- వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగాToday Horoscope in Telugu నిర్వహిస్తారు.
మిథునం – వృత్తి- వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. రుణాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు మేలు చేస్తాయి.
కర్కాటకం – ఆర్థిక అభివృద్ధి కొరకు విశేషంగా కృషి చేస్తారు. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. అందరిలోనూ ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
సింహం – పెట్టుబడులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రయత్నం మీద శుభకార్యాలు సానుకూల పరుచుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు.
కన్య – ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి స్థితి గోచరిస్తుంది. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగు పడుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు.
తుల – క్రయక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. అనుకోని వ్యక్తులు తారసపడతారు.
వృశ్చికం – నూతన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు. రుణ బాధలు తప్పకపోవచ్చు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు – ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంతకాలం మిమ్మల్ని అపార్థం చేసుకున్న ఒక వర్గం తిరిగి మళ్లీ చేరువవుతారు. బంధుమిత్రులతో సంబంధ బాంధవ్యాలు మరింత బలపడతాయి.
మకరం – మీ ప్రణాళికలో మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అవసరాలకు తగినంత ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు. అనవసరమైన బేషజాలకు వెల్లరు.
కుంభం – ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
మీనం – ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తారు. పాత బాకిలను కొంతవరకు తీర్చగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు సానుకూల పడతాయి. ప్రముఖులతో పరిచయాలు.