Site icon Prime9

Today Horoscope January 21: నేటి రాశి ఫలాలు.. ఏ రాశివారు ఏ పనులు చేపట్టాలంటే?

Horoscope Today in Telugu: మొత్తం 12 రాశులు. ఇవాళ ఏ రాశి వారికి ఎలా ఉంది? ఎలాంటి పనులు చేయాలి? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు.

మేషం – మీ ప్రయోజనాలు పదిలంగా ఉంటాయి. ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగ్గా ఉంటాయి. గోప్యంగా కొన్ని పనులు చేపట్టి వాటిని అభివృద్ధి పథంలో నడిపించడానికి సమాయత్తమవుతారు.

వృషభం – ఆర్థికంగా బాగుంటుంది. కొన్ని విషయాలలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. వృత్తి పరంగా కనబరిచే ఓర్పు మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది.

మిథునం – క్షణం తీరిక లేకుండా హడావుడిగా కాలాన్ని గడుపుతారు. అందుకు తగిన ప్రతిఫలం మాత్రం పూర్తిస్థాయిలో లభించదు. కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన అంశాలు లాభిస్తాయి.

కర్కాటకం – నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కావలసిన వనరుల సమీకరణకు ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తారు. ముఖ్యమైన అన్ని విషయాల పట్ల జాగ్రత్తతో వెలగడం చెప్పదగినది.

సింహం – చికాకు అసహనం అధికంగా ఉంటాయి. కీలకమైన సంతకాలు, విలువైన పత్రాల భద్రత విషయాలలో జాగ్రత్తలు వహించండి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయరాదు.

కన్య – ఆర్థిక స్థితి పైన శ్రద్ధ ఎక్కువగా చూపించవలసి ఉంటుంది. తేలికగా సులువుగా పూర్తి అవుతాయి అనుకున్న పనులు ఎంతో కష్టపడితే గాని పూర్తవవు. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు.

తుల – కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. నూతన విషయాలు తెలుసుకుంటారు. కుటుంబంతో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది.

వృశ్చికం – ఆర్థిక అభివృద్ధి కోసం కష్టపడాల్సిన తరుణం. మొండి బాకీలు వసూలు అవుతాయి. పరపతిని పెంచుకోవడానికి చేసే యత్నాలు అనుకూలిస్తాయి. సానుకూల ఫలితాలు సాధించగలుగుతారు.

ధనుస్సు – వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

మకరం – ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ఆరోగ్య విషయంలో మెలకువ అవసరం. మానసిక ఆనందం కలిగి ఉంటారు.

కుంభం – ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. రుణాలు చాలా వరకు తీరుస్తారు.ఇకపై రుణాలు చేయకూడదని నిర్ణయం తీసుకుంటారు.

 

Exit mobile version