Daily Horoscope: జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారికి ఊహించని లాభాలు ఉన్నాయి. అలానే కొందరి సమస్యలకు పరిష్కారం దొరకనుంది. ఇక పూర్తి రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం: సొంత నిర్ణయాలు.. స్వయం కృషి మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ రాశి వారికి ప్రస్తుతం అనుకూలమైన కాలం నడుస్తోంది. తలపెట్టిన పనుల్లో లాభం ఉంటుంది. ఉద్యోగంలో గుర్తింపు.. ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృషభం: ఇష్టమైన పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో సమయం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులకు ఆర్థిక సాయం చేస్తారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ఓ శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. స్థిర నిర్ణయాలతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఈ రాశి వారు దుర్గాస్తుతిని పఠిస్తే బాగుంటుంది.
మిథునం: అలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఉద్యోగం.. కుటుంబపరంగా సమస్యలు ఎదురవుతాయి. ఓపికతో ఉండటం మంచిది. పాజిటివ్ గా ఉండండి. నేడు ఈ రాశి వారు ఆశించిన విధంగా ఫలితం ఉంటుంది. తలచిన పనులు నెరవేరుతాయి. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బంది పెడతాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. గోసేవ చేయడం మంచిది.
కర్కాటకం: ఈ రాశి వారికి మంచి కాలం నడుస్తోంది. చేపట్టిన పనులన్నీ పూర్తవుతాయి. సంకల్ప బలం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ.. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. కీలక వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. బంధుమిత్రుల సాయం అందుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
సింహం: ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. మనసులో కోరిక నెరవేరుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలున్నాయి. సొంత నిర్ణయాలు కాకుండా.. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుంటే మంచిది. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. ప్రతిభకు తగిన ప్రశంసలు లభిస్తాయి. ఈశ్వరదర్శనం చేయడం మంచిది.
ఈ రాశుల వారికి ఆరోగ్యంలో మంచి ఫలితాలు (Daily Horoscope)
కన్య: వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలుంటాయి. అవసరాలకు ధన సహాయం అందుతుంది. ఈ రాశి వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మిత్రుల సలహాలు కూడా తీసుకోండి. శుభవార్త వింటారు.
ఉద్యోగం ప్రశాంతంగా గడిచిపోతుంది. కొన్ని ఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
తుల: నేడు ఈ రాశి వారికి మంచి కాలం ఉంటుంది. సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ముఖ్యమైన పనిని సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. సంతానం గురించి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని లాభాలుంటాయి.
వృశ్చికం: ఎన్ని సమస్యలున్నా ముందుకు సాగుతారు. సమాజంలో మంచిపేరు వస్తుంది. ఆగిపోయిన పసులను పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు చేతికి అందే అవకాశం ఉంది. తలపెట్టిన పనులు విజయాన్నిస్తాయి. గొప్ప ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
ధనుస్సు: ఈ రాశి వారు తేలికంగా పనులను పూర్తి చేసుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలం. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆత్మీయుల ప్రేమాభిమానాలు పొందుతారు. సానుకూల పరిస్థితులు ఉంటాయి.
మకరం: ఆటంకాలు ఎదురైనా ముందుకు సాగుతారు. కుటుంబ సమస్యలు నిరుత్సాహం కలిగిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో సమస్యలు వస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.
కుంభం: అనుకున్న పనులను వెంటనే పూర్తి చేస్తారు. బంధుమిత్రులకు సాయం చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. స్థిరమైన బుద్ధితో వ్యవహరించాలి. ఉద్యోగంలో ఉన్నతస్థితి ఏర్పడుతుంది.ఈ రాశి వారు శివారాధన చేయడం మంచిది.
మీనం: ఈ రాశి వారు పెళ్లిపరంగా శుభవార్తలు వింటారు. పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి.