Site icon Prime9

Daily Horoscope: జ్యోతిష్యం.. నేడు ఈ రాశి వారికి ధనలాభం

daily horoscope details of different signs on november 10 2023

daily horoscope details of different signs on november 10 2023

Daily Horoscope: జ్యోతిష్యం ప్రకారం నేడు రాశి ఫలాలు Daily Horoscope ఈ విధంగా ఉన్నాయి.

మేషం: ఈ రాశి వారికి అనుకున్న కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి. ఆప్తులతో కలహాలు.. రుణయత్నాలు.

ఆకస్మిక ప్రయాణాలు జరుగుతాయి. ఈ రాశి వారికి అనారోగ్యం, వ్యాపారం సాధారణంగా ఉంటాయి. వివిధ రంగంలో ప్రోత్సాహకర లభిస్తుంది.

సమయానికి విశ్రాంతి అవసరం.చంద్రశ్లోకం చదువుకోవాలి.

12 రాశుల వారి రాశి ఫలాలు…

వృషభం: ఈ రాశి వారు సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తుల కొనుగోలు.. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

వ్యాపారాలు అంచన మేరకు నడుస్తాయి. కొన్ని పనుల్ల మిశ్రమ వాతావరణం ఉంటుంది.

పనుల్లో ఆటంకాలు ఉన్నా.. వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇష్టమైనవారితో కాలాన్ని గడుపుతారు.

మిథునం: చిన్ననాటి మిత్రుల కలయిక. బంధువులతో తగాదాలు ఏర్పడతాయి. అనారోగ్యం.. ప్రయాణాలు రద్దు అవుతాయి.

ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. తోటివారి సహాయం తగిన అందుతుంది.

ప్రారంభించిన కొన్ని పనుల్లో ఇబ్బందులు వస్తాయి.

ఈ రాశి వారికి అవసరానికి మించిన ఖర్చులు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచింది.

కర్కాటకం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఈ రాశి వారి ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

స్నేహితుల సాయం అందుతుంది. పలుకుబడి పెరగడంతో పాటు.. వ్యాపారాలు అనుకూలిస్తాయి.
శుభవార్త వినడంతో పాటు.. మానసికంగా ఉల్లాసంగా లభిస్తుంది.

సింహం: దూరప్రయాణాలు. ఆస్తుల విక్రయాలు విరమించడం మంచిది. కుటుంబ కలహాలు.. ఆరోగ్యసమస్యలు ఉంటాయి.

వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. ప్రారంభించిన కార్యక్రమాలకు ఆటంకాలు ఉంటాయి.

ఇతరుల ప్రవర్తనతో బాధ ఉంటుంది. ఈ రాశి వారు గో సేవా చేయడం శ్రేయస్కరం.

కన్య: బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి.

సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

చక్కటి ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు.

 

ఈ రాశి వారికి ఉద్యోగ అవకాశాలు

తుల: ఈ రాశి వారికి నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఆప్తుల నుండి ధనప్రాప్తి లభిస్తుంది.

దైవచింతన.. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. బంధువులతో ఆనందంగా గడుపుతారు.

అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. హనుమాన్ చాలీసా చదవడం మంచింది.

వృశ్చికం: వ్యయప్రయాసలు.. బంధుమిత్రులో కలహాలు ఉంటాయి. ఎంత కష్టించినా ఫలితం మాత్రం శూన్యం.

అనారోగ్యం.. ఆకస్మిక ప్రయాణాలు జరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి. పనులకు ఆటంకాలు కలిగే అవకాశం ఉంది.

ఈ పనిలో జాగ్రత్తగా ఉండాలి. మనోబలం.. ఓర్పు చాలా అవసరం. భయాందోళనలను దరిచేరనీయకండి.

ధనుస్సు: బంధువుల విమర్శలు వస్తాయి. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. ధనవ్యయం.. కుటుంబ సమస్యలు నిరాశ కలిగిస్తాయి.

కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. ఈ రాశి వారు వివాదాలకు దూరంగా ఉండాలి.

మకరం: ఆప్తుల నుండి ఆహ్వానాలు.. ధన, వస్తులాభాలు చేకూరుతాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. దైవచింతన మంచిది.

వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి ఉంటుంది.
దైవబలంతో పనులను పూర్తిచేస్తారు. సుఖ సౌఖ్యాలు ఉంటాయి.

కుంభం: సన్నిహితులతో సత్సంబంధాలు.. కుటుంబంలో సమస్యలు తీరే సమయం ఇది. ఆర్థికంగా మెరుగైన పరిస్థితి ఉంటుంది.

వ్యాపారాలు, ఉద్యోగాలు సంతోషం కలిగిస్తాయి.
దైవబలంతో ఒక పనిలో అనూహ్య ఫలితాన్ని సాధిస్తారు.

చిన్న చిన్న ఆటంకాలను పట్టించుకోకుండా ముందుకు సాగితే అనుకున్నది త్వరగా సాధిస్తారు.

మీనం: కుటుంబసభ్యులతో తగాదాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

పనుల్లో అవాంతరాలు ఉంటాయి. మానసిక ఆందోళన.. వ్యాపారాలు ముందుకు సాగక ఇబ్బందిపడతారు.
ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version