Site icon Prime9

Best CNG Cars Under 10 Lakh: రూ.10 లక్షల బడ్జెట్.. మంచి సీఎన్‌జీ కార్లు ఇవే!

Best CNG Cars Under 10 Lakh

Best CNG Cars Under 10 Lakh

Best CNG Cars Under 10 Lakh: దేశవ్యాప్తంగా ఫెస్టివల్ సేల్స్ జోరందుకున్నాయి. దీపావళి సందర్భంగా ప్రజలు కొత్త కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా మన దేశంలో కార్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. సిటీల్లో ఎక్కువగా  తిరిగేవారు ఖర్చును తగ్గించేందుకు సీఎన్‌జీ కార్లను కొనడానికి సిద్ధం అవుతున్నారు. మీరు కూడా రూ.10 లక్షల బడ్జెట్‌లో మంచి సీఎన్‌జీ కారును కొనాలని చూస్తున్నట్లయితే అనేక గొప్ప కార్లు ఉన్నాయి. ఈ కార్ల జాబితాలో టాటా, మారుతి, హ్యుందాయ్ ఇలా చాలా మోడల్స్ ఉన్నాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Tata Altroz CNG
టాటా ఆల్ట్రోజ్ సీఎన్‌జీ చాలా మంచి కారు. అందులో చాలా ఎక్కువ స్పేస్ ఉంటుంది. క్యాబిన్‌లో 5 మంది కూర్చోవచ్చు. ఆల్ట్రోజ్ సిఎన్‌జీలో ట్విన్-సిలిండర్ టెక్నాలజీని ఉపయోగించారు. రెండు 30-30 లీటర్ ట్యాంకులు ఉన్నాయి. దీని బూట్‌లో 210 లీటర్ల బూట్ స్పేస్‌ ఉంది. ఇక్కడ చాలా వస్తువులను స్టోర్ చేయచ్చు. వాయిస్ కమాండ్ ఫంక్షన్‌తో ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్‌మెంట్ చేయగల సన్‌రూఫ్‌ను అందించిన మొదటి CNG కారు ఇది. టాటా ఆల్ట్రోజ్ సీఎన్‌జీ ధర రూ 7.55 లక్షల నుండి ప్రారంభమవుతుంది. భద్రత కోసం ఇందులో ఈబీడీ, 6 ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది.

Maruti Suzuki Wagon-R CNG
మారుతి సుజుకి వ్యాగన్-ఆర్ భారతీయులు ఎక్కువగా ఇష్టపడుతున్న కారు. వ్యాగన్-ఆర్‌లో మంచి స్థలాన్ని అందిస్తుంది. 5 మంది చాలా సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. వస్తువులు స్టోర్ చేయడానికి వ్యాగన్ R 1.0L పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఈ కారు CNGలో కూడా అందుబాటులో ఉంది. ఇది 34.05 కిమీ/కేజీ మైలేజీని అందిస్తుంది. భద్రత కోసం కారులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో పాటు EBD, ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. వ్యాగన్ ఆర్ ధర రూ.6.44 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. సిటీ డ్రైవ్‌కు వ్యాగన్-ఆర్ సిఎన్‌జి మంచి ఎంపిక.

Maruti Suzuki Swift CNG
మారుతి సుజుకి స్విఫ్ట్ CNG దాని అద్భుతమైన మైలేజ్‌ని అందిస్తోంది. మీకు దానిలో మంచి స్థలం లభిస్తుంది. ప్రస్తుతానికి మారుతి పెద్ద CNG ట్యాంక్‌ను మాత్రమే అందిస్తుంది. ఇంజన్ గురించి మాట్లాడితే మారుతి సుజుకి స్విఫ్ట్ CNG 1.2 లీటర్ ఇంజన్ కలిగి ఉంది. ఇది 69.75 పీఎస్ పవర్,  101.8 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది. ఈ కారు మైలేజ్ గురించి చెప్పాలంటే ఈ కారు కిలోకి 33 కిమీ మైలేజీని ఇస్తుంది. భద్రత కోసం కొత్త స్విఫ్ట్ న్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 3 పాయింట్ సీట్ బెల్ట్, హిల్ హోల్డ్ కంట్రోల్, ESC, EBDతో కూడిన యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. స్విఫ్ట్ CNG యువతను లక్ష్యంగా చేసుకునే సరికొత్త బ్లాక్ ఇంటీరియర్ వేరియంట్‌ విడుదల చేసింది. ఇందులో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది.

Hyundai Exter CNG
మీరు కాంపాక్ట్ సీఎన్‌జీ ఎస్‌యూవీ రూ. 10 లక్షల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయాలనుకుంటే మీరు హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీని పరిగణించవచ్చు. ఇందులో స్థల కొరత లేదు. అందులో 5 మంది సులభంగా కూర్చోవచ్చు. విశేషమేమిటంటే ఇందులో డ్యూయల్ సీఎన్‌జీ ట్యాంక్‌లు ఉన్నాయి. దీని కారణంగా దీని బూట్‌లో మంచి స్పేస్ కూడా ఉంది. పంర్ కోసం ఎక్స్‌టర్ సీఎన్‌జీ డ్యూయల్ సిలిండర్ 1.2L Bi-Fuel (పెట్రోల్ + CNG) ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 69 పీఎస్ పవర్,   95.2 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఇస్తుంది.

ఈ ఇంజన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. కంపెనీ ప్రకారం ఇది కిలోకు 27.1 కిమీ మైలేజీని ఇస్తుంది. భద్రతా ఫీచర్ల గురించి మాట్లాడితే కారులో సన్‌రూఫ్, ఎల్‌‌ఈడీ డీఆర్‌లు, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ కంట్రోల్, అనేక ఇతర గొప్ప ఫీచర్లు అందించబడ్డాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.8.50 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

Tata Punch
టాటా పంచ్ CNG 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ని కలిగి ఉంది. ఇది 73.4 PS పవర్, 103Nm టార్క్ ఇస్తుంది. ఇందులో 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ సౌకర్యం ఉంది. ఇందులో 5 మంది కూర్చునే సామర్థ్యం ఉంది. పంచ్ సీఎన్‌జీ  కారులో 30-30 కిలోల రెండు CNG సిలిండర్లు అందించారు. ఇందులో 210 లీటర్ల బూట్ స్పేస్ ఉంది, తద్వారా మీరు ఎక్కువ లగేజీతో ప్రయాణించవచ్చు. భద్రత కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 3 పాయింట్ సీట్ బెల్ట్, హిల్ హోల్డ్ కంట్రోల్, ESC, EBDతో కూడిన యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మీరు CNG మోడ్‌లో పంచ్ సీఎన్‌జీని స్టార్ట్ చేయచ్చు. దీని ధర రూ.7.23 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Exit mobile version