Site icon Prime9

Tata Car Offers: దసరా వచ్చింది ఆఫర్లు తెచ్చింది.. ఈ టాటా కార్లపై డిస్కౌంట్లే డిస్కౌంట్లు!

Tata Car Offers

Tata Car Offers

Tata Car Offers: దసరా నవరాత్రుల సందర్బంగా టాటా మోటర్స్ తన కార్లపై గొప్ప ఆఫర్లను తీసుకొచ్చింది. ఇప్పుడు కస్టమర్లు ఎంపిక చేసిన మోడళ్లపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు పొందొచ్చు. అలానే అదనంగా తక్కువ వడ్డీ రేట్లు, ఫైనాన్స్ ఎంపికలు, ఎక్స్‌ఛేంజ్ బోనస్‌లు కూడా అందిస్తున్నారు. ఇది కాకుండా కొన్ని కార్లపై ఉచిత యాక్సెసరీలు, సర్వీస్ ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నారు. మీరు కొత్త కారు కొనాలని చూస్తుంటే ఇది మీరు సరైన సమయం కావచ్చు. అయితే ఈ జాబితాలో ఏయే కార్లు ఉన్నాయి, వాటి ఫీచర్లు, ధరలు తదితర వివరాలు తెలుసుకుందాం.

Tata Tiago
టాటా టియాగో ప్రారంభ ధర రూ. 4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). నవరాత్రి. దసరా సందర్భంగా దాని ఎంపిక చేసిన వేరియంట్‌లపై రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ అందిస్తున్నారు. అలానే ఈ కారు దీపావళి వరకు ప్రత్యేక ధరలతో అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇది గొప్ప ఆఫర్‌గా మారుతుంది.

Tata Nexon
టాటా నెక్సాన్ ధర రూ. 7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఈ కారు డీలర్ వద్ద రూ. 25,000 ు క్యా్ ిస్కౌంట్, రూ. 20,000 ఎక్స్చేంజ్ బోనస్ పొందుతోంది. నవరాత్రి, దసరా సమయంలో నెక్సాన్‌ను కొనుగోలు చేయడానికి ఈ ఆఫర్ గొప్ప అవకాశం.

Tata Punch
టాటా పంచ్ ప్రారంభ ధర రూ. 6.12 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీని పెట్రోల్ వేరియంట్‌పై రూ. 20,000 క్యాష్ డిస్కౌంట్,= CNG వేరియంట్‌పై రూ. 15,000 తగ్గింపు అందుబాటులో ఉంది. ఇది కాకుండా 3,000 రూపాయల కార్పొరేట్ తగ్గింపు కూడా ఉంది. ఇది ఈ ఆఫర్‌ను మరింత ఆకర్షణీయంగా చేస్తుంది.

Tata Curvv
టాటా కర్వ్ ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). కస్టమర్లు ఈ కారును ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు. నవరాత్రి, దీపావళి పండుగల సమయంలో డెలివరీ పొందవచ్చు. పండుగల సీజన్‌లో కొత్త కారు కొనేందుకు ఇదే సరైన అవకాశం.

Tata Harrier
టాటా హారియర్ ధర రూ. 14.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఎంపిక చేసిన వేరియంట్‌లపై డీలర్-ఎండ్‌లో రూ. 50,000 వరకు అదనపు ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.

Exit mobile version