Site icon Prime9

Holi Festival : హోలీ రోజు ఈ వస్తువులను కొంటె ఇక అదృష్టం మీ వెంటే..

special story about things to buy on holi festival

special story about things to buy on holi festival

Holi Festival : ముందుగా ప్రైమ్9 న్యూస్ కుటుంబ సభ్యులు అందరికీ హోలీ శుభాకాంక్షలు. హిందూ మత విశ్వాసం ప్రకారం హోలీ పండుగ చాలా పవిత్రమైనదిగా అందరూ భావిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ పండుగను ప్రజలంతా ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు. ముఖ్యంగా చిన్నారులు ఈ పాండుగాను జరుపుకోవడానికి ఎంతో మక్కువ చూపిస్తారు. పల్లెటూరు నుంచి సిటీ వరకు హోలీని చాలా ప్రత్యేకంగా ఘనంగా జరుపుకుంటారు. కాగా పంచాంగం ప్రకారం, దేశ రాజధాని ఢిల్లీతో సహా అన్ని ప్రదేశాలలో 07 మార్చి 2023న హోలికా దహన్ .. 08 మార్చి 2023న రంగుల కేళి.. హోలీ ఆడతారు. అయితే ఈ సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి మార్చి 06, 2023న సాయంత్రం 04:17 గంటలకు ప్రారంభమై మార్చి 07, 2023 సాయంత్రం 06:09 గంటలకు ముగుస్తుంది. కనుక హోలికా దహన్ మార్చి 07, 2023న నిర్వహించబడుతుంది. మార్చి 08, 2023న హొలీని ఆచరిస్తున్నారు.

దేశంలోని అనేక ప్రాంతాలలో హోలికా దహన్‌ను జరుపుకుంటారు. ప్రజలు చెడు వదిలించుకోవడానికి, శ్రేయస్సును పొందడానికి అనవసరమైన వస్తువులను భారీ కుప్పలుగా చేరుస్తారు ఇరుగుపొరుగు వారు ఖాళీ స్థలం చుట్టూ చేరి, ఇకపై అవసరం లేని వస్తువులను సేకరించి మంటల్లో వేసి హోలీకా దహన్ జరుపుకుంటారు. నిన్న ఈ విధంగా జరుపుకోవడం .. పలు ప్రాంతాల్లో రంగులు కూడా పూసుకోవడం మనం గమనించవచ్చు.  అలానే హోలీ పౌర్ణమి రోజున ఇంట్లోకి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అవేంటో మీకోసం ప్రత్యేకంగా..

వెండి వస్తువులు (Holi Festival).. 

నేడు జరుపుకునే హోలీ సందర్భంగా ఈ వస్తువులలో కొన్నింటిని కొనుగోలు చేస్తే రోగాలు , బాధల నుండి ఉపశమనం పొందుతారని తెలుపుతున్నారు. సాధారణంగా దీపావళి రోజున వెండి వస్తువులను కొనడం మంచిదిగా భావిస్తారు. అయితే జ్యోతిష్యంలో హోలీకి కూడా ముఖ్యమైన స్థానం ఉంది. పాల్గుణ మాసం పౌర్ణమి నాడు వెండి వస్తువులు కొనుగోలు చేస్తే లక్ష్మీ అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

వెండి నాణెం.. 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హోలీ రోజున వెండి నాణెం లేదా వెండి చిన్న పెట్టె  కొంటె మంచిదని సూచిస్తున్నారు. ఆ తర్వాత దానిని పసుపుతో పాటు పసుపు గుడ్డలో కట్టి లక్ష్మీ దేవి విగ్రహం పక్కన ఉంచాలి. హోలీ పౌర్ణమి నాడు హోలికను కాల్చిన తర్వాత లభించే బూడిదను మీరు కొన్న వెండి పెట్టెలో వేసి అల్మారాలో ఉంచండి. హోలీ పౌర్ణమి నాడు ఈ పద్ధతిని అనుసరించడం వల్ల మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు అని శాస్త్ర పండితులు చెబుతున్నారు.

వెండి ఉంగరం.. 

హోలీ పౌర్ణమి రోజున వెండి ఉంగరాన్ని కొని పూజించండి. పూజించిన ఉంగరాన్ని ప్రసాదంగా స్వీకరించి ధరించండి. వెండి ఉంగరంతో మీ అదృష్టం ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది అని అంటున్నారు.

వెండి పట్టీలు.. 

వెండి పట్టీలు శాస్త్రోక్తంగా కూడా మహిళలకు మంచిగా సూచిస్తారు. కావున హోలీ పౌర్ణమి రోజున పట్టీలను కొనుగోలు చేసి.. ఆ తర్వాత వాటిని పాలతో కడగాలి. అప్పుడు మీరు దానిని స్నేహితులకు ఇవ్వవచ్చు లేదా మీరే ధరించవచ్చు. హోళీ పౌర్ణమి నాడు వెండి పట్టీలు ధరించడం ద్వారా లక్ష్మీ అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version