Site icon Prime9

Khammam: ఎద్దుమూత్రం పోసిందని ఫైన్ వేసిన అధికారులు

Khammam

Khammam

Khammam: అధికారుల ఉదాసీనత కారణంగా అమలుకావడం లేదు కాని బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన, మల విసర్జన నేరమే. అయితే ఖమ్మం జిల్లా పోలీసులు ఎద్దు బహిరంగ మూత్ర విసర్జన చేసిందని వాటి యజమానికి వందరూపాయల ఫైన్ విధించడం చర్చనీయాంశంగా మారింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా .. ఇల్లందు పట్టణంలోని నెంబర్ టు బస్తీలో నివసించే సుందర్ లాల్ స్థానికంగా ఉంటూ ఎద్దుల బండితో పరిసర ప్రాంతాల్లోని మట్టి, ఇసుకలను తోలుకుంటూ నాలుగు పైసలతో కుటుంబాన్ని పోషించు కుంటున్నా డు. ఈ క్రమంలో స్థానిక సింగరేణి జిఎం కార్యాలయం ముందు నుండి మట్టి తీసుకొని వచ్చేందుకు వెళుతున్న క్రమంలో సింగరేణి జీఎం కార్యాలయం ముందు ఎద్దు ఆగి మూత్రం పోసింది. దీనితో సిబ్బంది నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో ఈ ఫిర్యాదుపై, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 290 (పబ్లిక్ న్యూసెన్స్) కింద సుందర్ లాల్ పై పోలీసు కేసు నమోదు చేశారు. అతన్ని ఇల్లందులోని ప్రత్యేక మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఈ నేరానికి గానూ అతను రూ.100 జరిమానా చెల్లించాలని నవంబర్ 29న నోటీసు అందింది. అయితే, తన దగ్గర డబ్బులు లేకపోవడంతో కోర్టు కానిస్టేబుల్ ను బతిమాలుకున్నానని మళ్లీ ఇస్తాను ఇవ్వమంటే ఆ వందరూపాయలు అతను ఇచ్చాడని సుందర్ లాల్ చెప్పాడు. తనలాంటవారిపై కేసు పెట్టి ఫైన్ వేయాలంటే రోజూ కొన్ని వేల పశువులకు వేయాలని సుందరలాల్ అంటున్నాడు.

Exit mobile version