Maruti Discounts: ఆఫర్ల రచ్చ.. మారుతి బుజ్జి కారుపై పెద్ద డిస్కౌంట్.. మైలేజ్‌లో తగ్గేదేలే!

Maruti Discounts: మారుతి సుజుకి ఈ నెల అంటే అక్టోబర్‌లో తన కార్లపై నవరాత్రి, దీపావళి ఆఫర్లను ప్రకటించింది. ఈ లిస్టులో కంపెనీ బుజ్జి ఎస్‌యూవీ S-ప్రెస్సో ఉంది. ఈ కారు డిజైన్ చాలా బోల్డ్, స్పోర్టీగా ఉంటుంది. సేఫ్టీ ఫీచర్లకు ఎలాంటి లోటు లేదు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.26 లక్షల నుండి రూ. 6.12 లక్షల వరకు ఉంది. మీరు ఈ నెలలో S-ప్రెస్సోను ఇంటికి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే ఇప్పుడు మీరు ఈ కారుపై భారీగా డబ్బును ఆదా చేసుకోవచ్చు. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో కారు డిజైన్ చాలా బోల్డ్, స్పోర్టీగా ఉంటుంది. ఇది అధిక గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. అంతే కాదు ఈ కారులో సేఫ్టీ ఫీచర్లకు ఎలాంటి లోటు లేదు. ఎస్-ప్రెస్సో ఎక్స్ షోరూమ్ ధర రూ. 4.26 లక్షల నుండి రూ. 6.12 లక్షల వరకు ఉంది. మీడియా కథనాల ప్రకారం.. ప్రస్తుతం ఈ కారుపై రూ.55,000 తగ్గింపు అందుబాటులో ఉంది.

ఈ తగ్గింపులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉన్నాయి. ఈ కారు పెట్రోల్ మోడ్‌లో 25 కిమీ, సిఎన్‌జిపై 33 కిమీ మైలేజీని అందిస్తుంది.మారుతి సుజుకి ఎస్ ప్రెస్సోలో మంచి స్పేస్ ఉంది, ఇందులో 5 మంది కూర్చోవచ్చు. పర్ఫామెన్స్ కోసం కారులో 1.0L పెట్రోల్ ఇంజన్ ఉంది. మారుతి S ప్రెస్సో 5 స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో వస్తుంది.

సిటీ డ్రైవింగ్ కోసం ఇది మంచి కారు, కానీ హైవేలో లాంగ్ జర్నీకి కంఫర్ట్‌గా ఉండదు.దీని సీటింగ్ పొజిషన్ మీకు SUV లా అనిపిస్తుంది. ఈ కారులో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో కూడిన EBD, ఎయిర్‌బ్యాగ్‌ల కంఫర్ట్ ఉంది. ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.