Manchu Family Controversy: సద్దుమనిగిందనుకున్న మంచు ఫ్యామిలీ గొడవలు మరోసారి అగ్గిరాజుకున్నాయి. మరోసారి మంచు ఫ్యామిలీ వివాదం తెరపైకి వచ్చింది. గత 10 రోజులుగా మంచు ఫ్యామిలీలోని గొడవలు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. డిసెంబర్ 10న ఈ గొడవలు తారస్థాయికి చేరాయి. ఆ తర్వాత పోలీసులు కేసు, జర్నలిస్ట్ దాడి ఘటనలతో ఈ తగాదాలు చల్లారినట్టు కనిపించాయి. కానీ శనివారం మరోసారి అన్నదమ్ముల గొడవలు బయటపడ్డాయి. దీనికి మంచు మనోజ్ ఇచ్చిన స్టేట్‌మెంట్ నిదర్శనం. తమ తల్లి పుట్టిన రోజు నేపథ్యంలో మంచు విష్ణు తన అనుచరులతో కలిసి జల్‌పల్లి నివాసంకు వచ్చాడు.
ఈ క్రమంలో జనరేటర్‌లో చక్కర పోయించి విద్యుతు సరఫరా నిలివేశారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన సీసీ కెమెరాను కూడా విడుదల చేశాడు. తన సోదరుడు విష్ణు వల్ల తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆరోపించాడు. ఈ మేరకు మనోజ్ ఓ పత్రిక ప్రకటన విడుదల చేశాడు. “నిన్న నేను షూటింగ్‌కి వెళ్లాను. నా భార్య మౌనికి మా కుమారుడి పాఠశాలలోని ఓ ఈవెంట్‌కు హాజరైంది. ఇంట్లో మా అమ్మ, నా ఏడే నెలల కూతురు, బంధువులు ఉన్నారు. శనివారం మా అమ్మ బర్త్‌డే సందర్భంగా కేకు ఇచ్చే నేపంతో నా సోదరుడు మంచు విష్ణు తన అనుచరులు రాజ్ కొండూరు, కిరణ్, విజయ్ రెడ్డిలతోపాటు కొందరు బౌన్సర్లతో ఇంటికి వచ్చాడు. అదే సమయంలో తన అనుచరులతో జనరేటర్లలో చక్కెర పోయించాడు.
దాంతో రాత్రి మా ఇంటికి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో మేమంతా ఆందోళనకు గురయ్యాము. ఏమైంది చూడగా జనరేటర్‌లో చక్కెర కనిపించింది. దీంతో మేమంతా ఆందోళనకు గురయ్యాయి. ఇలాంటి చర్యలు అసలు సహించలేనివి. దీనివల్ల ఇంట్లో అగ్నప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఇంట్లో మా అమ్మ, 9 నెలల కుమార్తె, కుమారుడు, అత్తమామలు ఉన్నారు. జనరేటర్లకు సమీపంలో వెహికిల్స్ పార్క్ చేసి ఉన్నాయి. అక్కడే గ్యాస్ కనెక్షన్ కూడా ఉంది. ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే పరిస్థితి ఏంటి. మాపై కుట్ర పన్ని ఉద్దేశపూర్వకంగా మా అన్నయ్య ఈ చర్యకు పాల్పడ్డారు. ఆయన వల్ల మాకు ప్రాణహాని ఉంది” మనోజ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
#Hyderabad : #MohanBabu family issue:
The #ManchuFamily feud has resurfaced once again now.#ManchuManoj releases #CCTV footage accuses half-brother #ManchuVishnu of tampering with his home generator using diesel-sugar mix, endangering his family. Manchu Manoj alleging a… pic.twitter.com/NPQGHgC6vn
— Surya Reddy (@jsuryareddy) December 15, 2024
ఈ సంఘటన తన హృదయాన్ని కలచివేసిందన్నారు. మా ఇంటికి వచ్చిన మంచు విష్ణు టీమ్ ఇంటి నుంచి వెళ్లిపోతూ నా పనివాళ్లను అక్కడ నుంచి పంపించివేశారని, తన దంగల్ కోచ్‌ను కూడా బెదిరించినట్టు ఆరోపించారు. తన తల్లి పుట్టినరోజున ఇలా జరగడం తన హృదయాన్ని కలచివేసిందని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. రోజూరోజూ నేను, నా కుటుంబం భయం భయంతో బతుకుతున్నామని, దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామంటూ మనోజ్ అన్నారు. ఈ ఘటనపై పహాడీషరీఫ్ ఠాణాకు వెళ్లి మనోజ్ ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.