Site icon Prime9

2024 Kia Carnival: ఇది కారా లేక పడవా మావ.. 11 సీట్లతో కియా కొత్త కార్.. సేఫ్టీ ఫీచర్లు ఏమైనా ఉన్నాయా!

KIA CARNIVAL

KIA CARNIVAL

2024 Kia Carnival: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా ఇటీవలే 2024 కియా కార్నివాల్‌ను భారత్‌లో ప్రారంభించింది. ఇది లగ్జరీ ఎమ్‌వీపి మోడల్. నాల్గవ తరం కియా కార్నివాల్ ఎమ్‌వీపి ధర రూ.63.90 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో ఏడు సీట్లు ఉంటాయి. ఫ్యామిలీతో దూర ప్రయాణాలు చేసేందుకు చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ఈ క్రమంలో మీరు కూడా ఈ కారును మీ సొంతం చేసుకోవాలనుకుంటే ధర, ఫీచర్లు, ఇంజన్ తదితర వివరాలు గురించి తెలుసుకోండి.

కియా MPV భారతదేశంలో లిమోసిన్, లిమోసిన్ ప్లస్ వేరియంట్‌లు అనే రెండు వేరియంట్‌లలో విడుదల చేశారు. ఈ రెండు వేరియంట్‌లు 7 సీటర్ కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉన్నాయి. ఈ కారు గ్లోబల్ మార్కెట్‌లో 11 సీట్ల వేరియంట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇది కొత్త గ్రిల్, వర్టికల్ LED హెడ్‌ల్యాంప్‌లు, కొత్త అల్లాయ్ వీల్స్, కొత్త రూఫ్ రెయిల్‌లు, షార్క్ ఫిన్ యాంటెన్నా, L-ఆకారపు LED DRLలు, కాంట్రాస్ట్ స్కిడ్ ప్లేట్, LED లైట్ బార్‌తో కూడిన కొత్త ేసియాని పొందుతుంది.

అలాగే 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, డ్యూయల్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కారు రూపాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఫీచర్ల గురించి మాట్లాడినట్లయితే కొత్త కియా కార్నివాల్‌లో రెండు 12.3 అంగుళాల స్క్రీన్‌లు ఉన్నాయి. ఒకటి డ్రైవర్‌కు స్క్రీన్‌గా, మరొకటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌గా పని చేస్తుంది. ఇది కాకుండా 11 అంగుళాల హెడ్-అప్ డిస్‌ప్లే ,12 వే అడ్జస్ట్ చేయగల డ్రైవర్ సీటును కలిగి ఉంది. సీటు వెంటిలేషన్, హీటింగ్‌తో అమర్చబడి ఉంటుంది. 64 కలర్ యాంబియంట్ లైట్, రెయిన్ వైపర్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ కూడా వీటితో అందుబాటులో ఉన్నాయి.

2024 కియా కార్నివాల్ MPV‌లో 8 ఎయిర్ బ్యాగ్‌లు, 2 ATS ఫీచర్లు, EBDతో కూడిన ABS, ESC, లెవెల్ 2 ADAS, హిల్ అసిస్ట్ కంట్రోల్ వంటి భద్రతా ఫీచర్లు ఉంటాయి. కియా ఈ కారులో 2.2 లీటర్, 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్‌ను అందించింది. ఈ ఇంజన్ గరిష్టంగా 193 హెచ్‌పి పవర్, 441 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఎనిమిది స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లింకై ఉంటుంది.

కొత్త కార్నివాల్ ధరలు రూ. 63.90 లక్షల నుండి ప్రారంభమవుతాయి (ఎక్స్-షోరూమ్). కంపెనీ కొత్త కార్నివాల్ కోసం అధికారిక బుకింగ్‌లను అక్టోబర్ 16 నుండి ప్రారంభించటానికి ముందే ప్రారంభించింది. సరికొత్త కియా కార్నివాల్‌ను రూ. 2 లక్షలకు బుక్ చేస్తున్నారు. ఆసక్తి గల కస్టమర్‌లు ఈ కారును అధికారిక వెబ్‌సైట్ లేదా సమీపంలోని ఏదైనా డీలర్‌షిప్ నుండి రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

Exit mobile version