Horoscope Today: జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల వారికి మంచి జరగనుంది. అలాగే ఈ రాశుల వారు నేడు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచింది. ఇక నేటి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి.
మేషం: ఈ రాశి వారు నేడు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచింది. అలాగే ఒక శుభవార్త వింటారు. కొత్త పనుల జోలికి అస్సలు వెళ్లకండి. ఇతరులపై ద్వేష భావాన్ని అరికట్టండి. ఈరోజు ఆధ్యాత్మిక విజయాన్ని పొందే అవకాశం కూడా ఉంది. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. దుర్గాస్తుతి చదవడం వల్ల మంచిది.
వృషభం: ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. అనవసర ఖర్చులను తగ్గించుకోండి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. విదేశాల నుంచి సమాచారం అందుతుంది. కుటుంబంతో కాలం గడుపుతారు. అనారోగ్యం తలేత్తే అవకాశం ఉంది. ప్రయాణాల పట్ల జాగ్రత్త వ్యవహరించాలి. తెలివితేటలతో పనులను పూర్తిచేస్తారు. ఆంజనేయ స్తోత్రం చదవాలి.
మిథునం: మీరు చేసే పనికి సంబంధించిన రంగంలో శుభవార్త వింటారు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగుతుంది. ఉద్యోగం మారాలన్న ఆలోచన మానుకోండి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఈ రాశి వారు స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. బంధువులతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం. శివనామస్మరణ ఈ రాశివారికి ఉత్తమం.
కర్కాటకం: నేడు ఈ రాశి వారికి పలుకుబడితో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారం భాగస్వాములతో విభేదాలు పరిష్కారం అవుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించడం మంచిది.
సింహం: ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. మొండి బాకీలతో అవస్థలు తప్పవు. అన్నదమ్ములతో ఆస్తి విషయంలో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. మిత్రుల సహాయంతో పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మిశ్రమ వాతావరణం. నిర్లక్ష్యం చేసిన అంశాలు ఇబ్బంది పెడతాయి. గోసేవ చేయడం మంచిది.
కన్య: ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వృత్తి రంగాల్లో పురగోతి సాధిస్తారు. ఆదాయపరంగా సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. దుర్గాధ్యానం ఈ రాశి వారికి శుభప్రదం.
ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి (Horoscope Today)
తుల: వృత్తి వ్యాపారాల వారు చక్కని లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో మీ ప్రాభవం కొద్దిగా తగ్గుతుంది. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. తొందరపాటు వల్ల మాటల వల్ల నష్టపోతారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల రాకతో సమయం గడిచిపోతుంది. ఆంజనేయుడిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
వృశ్చికం: ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. విభేదాలు పరిష్కారం అవుతాయి. ఆస్తి వివాదాల విషయంలో జాగ్రత్త. జీవిత భాగస్వామికి స్వల్ప అనారోగ్యం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. రోడ్డు ప్రమాదాలతో జాగ్రత్త వహించాలి. కనకధారాస్తోత్రం చదవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
ధనుస్సు: ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో ఉంటుంది. ధన లాభాం కూడా ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు ప్రయోజనాలను ఇస్తాయి. ఉద్యోగంలో ప్రతిభకు తగిన గుర్తింపు ఉంటుంది. వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.
మకరం: ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండదు. ఉద్యోగ జీవితం గౌరవప్రదంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు నేడు శుభవార్త అందుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచింది. ఆర్థికంగా వాగ్దానాలు చేయకండి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. శివస్తోత్రం చదివితే మంచిది.
కుంభం: ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో ఆచి తూచి మాట్లాడండి. భాగస్వాములతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఉంటాయి. రావలసిన నగదు సకాలంలో చేతికి అందదు. అనవసర హామీల, వాగ్దానాలకు చేయకండి. నిరుద్యోగులు ఉద్యోగంలో చేరవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శ్రీఆంజనేయ ఆరాధన మంచిది.
మీనం: ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ధన లాభం ఉండే అవకాశం ఉంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. సన్నిహితులకు ఆర్థిక సహాయం చేయాల్సివస్తుంది. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శుభకరం.