Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల లోని వారు డబ్బు విషయంలో జాగ్రత్త పాటిస్తే మంచిదని సూచిస్తున్నారు. అలాగే మార్చి 29 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
మేషం..
ఈ రాశి వారికి ప్రస్తుతం సమయం అన్ని విధాలుగాను అనుకూలంగా ఉంది. సద్విని యోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ ప్రోత్సాహం లభి స్తాయి. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగిపో తాయి. కుటుంబంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. ఆదాయపరంగా గతంలో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో మంచి విజయాలు సాధిస్తారు.
వృషభం..
ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. మనశ్శాంతి ఏర్పడుతుంది. ఉద్యోగంలో సహచరులకు ఎంతగానో సహాయపడతారు. ఆరోగ్యం నిల కడగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడు తుంది. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులకు పర్వాలేదు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మిథునం..
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సంపాదన పెరగ డానికి అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఒకటి రెండు మొండి బాకీలు వసూలు అవుతాయి. మిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యార్థులు సునా యాసంగా విజయాలు సాధిస్తారు. నిరుద్యోగు లకు ఒకటి రెండు ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెల కొంటుంది.
కర్కాటకం..
గ్రహాల స్థితిగతులు అనుకూలంగా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాల విషయంలో ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మున్ముందు సత్ఫలితాలను ఇస్తాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేసుకోవడం మంచిది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ప్రతి విషయంలోనూ కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. విద్యార్థులు మరింత శ్రద్ధ పెడితే ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారు. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. మొత్తం మీద ఈ రోజు చాలా వరకు ప్రశాంతంగా గడిచిపోతుంది.
సింహం..
కొత్త ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు వచ్చే సూచనలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం మంచిది. కుటుంబ సమస్య ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది. స్నేహితు లతో విందులు, వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్య పరిస్థితి చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. అయితే ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవడానికి ఇది సమయం కాదు.
కన్య..
మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టడానికి ఇది ఎంతగానో అనుకూల సమయం. కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా మరింత పురోగతి సాధించడానికి అవకాశాలు అంది వస్తాయి. ఆరోగ్యం బాగా సహకరిస్తుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. అదనపు బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. ఎవరికైనా వాగ్దానాలు చేయడం హామీలు ఉండటం ప్రస్తుత పరిస్థితుల్లో అంత శ్రేయస్కరం కాదు. ముఖ్యమైన పనులు తేలికగా పూర్తి అవుతాయి. విద్యార్థులకు సమయం బాగానే ఉంది.
తుల..
చిన్న వ్యాపారాల వారికి, స్వయం ఉపాధి వారికీ ఈ రోజు చాలావరకు అనుకూలంగా ఉంది. ఆశించిన స్థాయిలో లాభాలు గడించే అవకాశం ఉంది. ఉద్యోగులకు కూడా మంచి జరిగే సూచనలున్నాయి. శుభవార్త వింటారు. ఆదాయం మెరుగుపడుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులు సొంత ఊర్లోనే ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. స్నేహం ముసుగులో కొందరు మిమ్మల్ని పక్కదోవ పట్టించే ప్రమాదం ఉంది. విద్యార్థులకు పర్వాలేదు.
ఈ రాశుల లోని వారికి సమయం అనుకూలం (Daily Horoscope)..
వృశ్చికం..
ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు అదుపు తప్పవచ్చు. పొదుపు పాటించడం మంచిది. వృత్తి, వ్యాపారాలలో కూడా శ్రమ ఎక్కువయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల పడతాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది.
ధనుస్సు..
ఈ రాశి వారికి ఆర్థిక పరంగా కలసివచ్చే కాలం ఇది. ఆదాయం పెంచుకోవడానికి మంచి నిర్ణయాలు తీసుకొని ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం చాలావరకు సహకరిస్తుంది. అనవసర ఖర్చులు, విలాసాలు తగ్గించుకోవడం మంచిది. వ్యక్తిగత విషయాలలో మిత్రుల నుండి ఆశించిన సహకారం లభిస్తుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. కొత్త ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.
మకరం..
ఈ రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో కొద్దిగా చికాకులు తలెత్తే అవకాశం ఉంది. అధికారులతో సమస్య లను సామరస్యంగా పరిష్కరించు కోవటం మంచిది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు అదుపు తప్పుతాయి. ఆర్థిక విషయాలలో అతి జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు బాగానే ఉంటుంది. మిత్రులను సైతం గుడ్డిగా నమ్మటం మంచిది కాదు.
కుంభం..
ఉద్యోగంలో శారీరక, మానసిక శ్రమ ఎక్కువగా ఉంటాయి. ఆర్ధిక పరిస్థితి నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు బాగా పెరుగుతాయి. వాగ్దానాలు చేయడం, హామీలు ఉండటం మంచిది కాదు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు మొదలు పెడతారు. నిరుద్యోగులు మరి కొంత కాలం ఆగాల్సి ఉంటుంది. ఇతరుల విషయాల్లో తల దూర్చడం మంచిది కాదు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. విద్యార్థులకు శ్రమ, ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటాయి.
మీనం..
ఉద్యోగ పరంగా సమయం అనుకూలంగా ఉంది. ఆదాయం పెరగటానికి, ప్రమోషన్కు అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. పొదుపు పాటిస్తారు. ఇతరుల నుంచి రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. వృత్తి వ్యాపారాల వారు లాభాల బాటలో ముందుకు వెళతారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. సమాజ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వారితో మంచి పరిచయాలు ఏర్పడతాయి.