Site icon Prime9

Daily Horoscope : నేడు పలు రాశుల లోని వారి మనసులోని కోరికలు అనుకోకుండా నెరవేరుతాయి అని తెలుసా..!

daily horoscope details of different signs on july 23 2023

daily horoscope details of different signs on july 23 2023

Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల లోని వారి మనసులోని కోరికలు అనుకోకుండా నెరవేరుతాయి అని తెలుస్తుంది. అలాగే మార్చి 26 వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

మేషం.. 

ఈ రాశి వారికి మనసు లోని ఒకటి రెండు కోరికలు అనుకోకుండా నెరవేరుతాయి. కుటుంబ సభ్యులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. పెళ్లి సంబంధం విషయంలో చికాకులు ఎదురవుతాయి. బంధువులు కొందరు సహాయ సహకారాలు అందిస్తారు. ముఖ్యమైన పనులు తేలికగా పూర్తవుతాయి. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. ప్రేమ జీవితంలో ముందడుగు వేస్తారు.

వృషభం..

ఈ రాశి వారి అదనపు ఆదాయ ప్రయత్నాలు చాలావరకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా మారుతుంది. ఇతరులకు వాగ్దానాలు చేయడం, హామీలు ఉండటం ప్రస్తుతానికి విరమించడం మంచిది. నిరుద్యోగులకు  సొంత ఊరులోనే ఉద్యోగం లభిస్తుంది. పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది. దూర ప్రాంతం నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ప్రేమ జీవితం పట్ల కొద్దిగా ఆసక్తి తగ్గుతుంది.

మిథునం..

ఈ రాశి వారు ఉద్యోగ పరంగా మంచి స్థితికి చేరుకునే అవకాశం ఉంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. కుటుంబంలో ఒకటి రెండు సమస్యలు అప్రయత్నంగా చక్కబడతాయి. వ్యాపారం నిలకడగా ముందుకు సాగుతుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. ఆహార విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించడం మంచిది. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా నిరుత్సాహం కలిగిస్తాయి.

కర్కాటకం..

వ్యాపారంలోను, ఉద్యోగంలోనూ సమస్యలు ఉన్నప్పటికీ ముందుకు వెళ్తారు. ఆర్థిక పరిస్థితి కూడా ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి నిపుణులకు అవకాశాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం లభిస్తుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. ప్రేమ జీవితం సాఫీగా సాగిపోతుంది.

సింహం..

సన్నిహితుల సహకారంతో కొత్త వ్యాపారం చేపట్టడానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. మంచి కంపెనీల నుంచి ఆఫర్లు వస్తాయి. నిరుద్యోగులకు తీపి కబురు అందుతుంది. పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. ఆహార విహారాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది.

కన్య..

వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. రుణ దాతల దగ్గర నుంచి కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్యం జాగ్రత్త.

తుల..

ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో చక్కబడుతుంది. బాగా దగ్గర బంధువుల నుంచి ఊహించని విధంగా సహాయం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా సాగుతాయి. పెళ్లి సంబంధం వాయిదా పడే అవకాశం ఉంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఇబ్బందులు ఎదురవుతాయి.

ఈ రాశి వారికి దూర ప్రాంతం నుంచి శుభవార్త (Daily Horoscope)..

వృశ్చికం..

దూర ప్రాంతం నుంచి శుభవార్త ఒకటి అందుతుంది. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. కుటుంబ పరంగా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ ఒకటి రెండు ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని రకాల వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

ధనుస్సు..

ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. అదృష్ట యోగం పడుతుంది. ఇక రాదని వదిలేసుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఇతరులకు వాగ్దానాలు చేయడం కానీ, హామీలు ఉండటం కానీ చేయకపోవడం మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. పరిచయస్తులలో మంచి పెళ్లి సంబంధం కుదరవచ్చు. ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ప్రేమ వ్యవహారాలలో దూసుకుపోతారు.

మకరం..

ఆరోగ్యం బాగా సహకరిస్తుంది. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. బంధువుల వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. స్నేహితుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి.

కుంభం..

ఆర్థిక పరిస్థితి ఆశించినంతగా మెరుగుపడుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. బంధువులు గానీ, కొందరు మిత్రులు గానీ అపార్థం చేసుకునే సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు చాలావరకు లాభాల బాటలో నడుస్తాయి. ఐటి నిపుణులకు మంచి పురోగతి కనిపిస్తోంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.

మీనం..

ఒక మంచి శుభ పరిణామం చోటుచేసుకుని జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. బంధు వర్గం నుంచి ఒక మంచి పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఒకరిద్దరు సన్నిహితులకు సహాయం చేయడం జరుగుతుంది. కుటుంబంలో దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఉద్యోగ పరంగా ఆశించిన ప్రయోజనం అనుభవానికి వస్తుంది. వృత్తి వ్యాపారాలు పురోగతి సాధిస్తాయి. ప్రేమ వ్యవహారాలు సానుకూల పడతాయి.

 

Exit mobile version