Site icon Prime9

Daily Horoscope : నేడు పలు రాశుల వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయని తెలుసా..?

daily horoscope details of different signs on november 10 2023

daily horoscope details of different signs on november 10 2023

Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయని తెలుస్తుంది. అలాగే మార్చి 14 వ తేదీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం.

మేషం.. 

ఈ రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. సునాయాసంగా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

వృషభం.. 

ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఒకరిద్దరు స్నేహితులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. కొందరు బంధువులకు సలహాలు ఇచ్చి సహకరిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. ప్రేమ వ్యవహారాలలో ముందుకు దూసుకుపోతారు.

మిథునం..

అదనపు ఆదాయ ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయాల విషయంలో కుటుంబ సభ్యులను కూడా సంప్రదించడం మంచిది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.

కర్కాటకం.. 

కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. మొండి బాకి ఒకటి వసూల్ అవుతుంది. ఆర్థిక అవసరాలు తీరుతాయి. పొదుపు పాటిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. దూర ప్రాంతం నుంచి శుభవార్త వింటారు. బంధువు లలో ఒకరు ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణాల వల్ల డబ్బు నష్టం జరుగుతుంది. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

సింహం..

అనుకోకుండా చిన్నపాటి అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. కొందరు స్నేహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఆహార విషయాల్లో జాగ్రత్త ఉండటం మంచిది. ఉద్యోగ జీవితం బాగానే ఉంటుంది. అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ వస్తుంది. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో ముందుకు దూసుకుపోతారు.

కన్య.. 

ఉద్యోగంలో సమస్యలు ఎదురవుతున్నా పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేస్తారు. సహచరుల నుంచి అండదండలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఒడిదుడుకులకు లోనవుతుంది. వాగ్దానాలు చేయడం, హామీ ఇవ్వడం ప్రస్తుతానికి మంచిది కాదు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. శరీరానికి కాస్తంత విశ్రాంతి అవసరం. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి.

తుల.. 

మనసులోని ముఖ్యమైన కోరిక ఒకటి నెరవేరుతుంది. ఉద్యోగంలో లక్ష్యాలు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. కొందరు బంధువులు లేనిపోని మాటలతో ఇబ్బంది పెడతారు. మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. వ్యాపారంలో కొద్దిపాటి లాభాలు గడిస్తారు. ఐటీ వారికి చాలా బాగుంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.

ఈ రాశుల వారికి ఆర్ధికంగా సహాయం లభిస్తుందట (Daily Horoscope)..

వృశ్చికం..

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఐటీ రంగం వారు పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అనవసర ఖర్చులు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. కుటుంబంలో పెద్దల నుంచి ఆర్థికంగా సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

ధనుస్సు.. 

కొంచెం కష్టం మీద ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. ఎక్కువగా ఇతరుల మీద ఆధారపడటం మంచిది కాదు. స్నేహితులు ముఖం చాటేస్తారు. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఆదాయపరంగా నిలకడగానే ఉంటుంది. విలాసాల మీద ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం చాలావరకు అనుకూలిస్తుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి.

మకరం.. 

ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అవసరాలు తీరుతాయి. ఉద్యోగం పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సహచరుల నుంచి సహకారం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో కొత్త మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు వచ్చే సూచనలు ఉన్నాయి. పిల్లల నుంచి సమస్యలు తలెత్తుతాయి. శుభవార్త వింటారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ముందుకు వెళతాయి.

కుంభం..

ఇంటా బయటా విపరీతంగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలను తలకెత్తుకోవాల్సి వస్తుంది. అతి కష్టం మీద ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగానికి సంబంధించి కొత్త ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. వృత్తి వ్యాపారాలు బాగానే సాగిపోతాయి. ఆరోగ్యం జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలు చాలావరకు పరవాలేదు.

మీనం..

మానసిక ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. ఉద్యోగంలో పని భారం పెరిగి ఇబ్బంది పడతారు. ఆర్థిక వ్యవహారాలలో ముందుకు వెళతారు. ఇతరులకు సహాయం చేస్తారు. పిల్లల నుంచి మంచి కబుర్లు వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్ చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అయితే ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బంది పడతారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version